Yeluru Floods: కాకినాడ జిల్లాలో ఏలేరు వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. 8 మండలాల పరిధిలోని 65 గ్రామాల్లో పంట పొలాలు నీటిలో మునిగిపోయాయి. కాకినాడ-కత్తిపూడి మధ్య గల 216వ జాతీయ రహదారిపై పిఠాపురం, గొల్లప్రోలు వద్ద, ఇతర ప్రధాన రహదారుల పై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఈ మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిప్యాయి.
మరో వైపు పిఠాపురం, గొల్లప్రోలు, కొత్తపల్లి మండలాలతోపాటు కిర్లంపూడి, ప్రత్తిపాడు, పెద్దాపురం, సామర్లకోట, ఏలేశ్వరం మండలాల్లో పంటపొలాలు, పలు గ్రామాల్లో గృహాలు వరద నీటిలో చిక్కుకున్నాయి.
బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు వరద తీవ్రత పెరుగుతూనే ఉంది. దీంతో ఇవాళ ఇక్కడ వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని రైతులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం సహాయ పునరావాస చర్యలకు ఉపక్రమించింది. కానీ అందరికీ సరిగా అందడం లేదు. కొంత మంది చీకట్లో మగ్గుతున్నారు. మొత్తంగా వరద ఉధృతి ముంపులోనే 65 గ్రామాలు మగ్గుతున్నాయి. యేలేరు వల్ల చాలా సబ్ స్టేషన్లు నీటిలో మునిగిపోయాయి. దీంతో ప్రజలు చీకట్లోనే మగ్గుతున్నారు. మొత్తంగా చీకటితో పాటు ప్రజలు పాలు, స్వచ్చమైన నీళ్లు లేక అల్లాడుతున్నారు.
ఇదీ చదవండి: పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకోవడానికి కారణమేమిటంటే..!
ఇదీ చదవండి: పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.