Summer Temperatures: మరో 3 రోజులు భారీగా ఉష్ణోగ్రత, బయటకు వెళ్లవద్దని ఐఎండీ హెచ్చరికలు

Summer Temperatures: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతుండటం భయం కల్గిస్తోంది. రానున్న మూడ్రోజులు వడగాల్పుల తీవ్రత మరింత పెరగవచ్చనే హెచ్చరికలు ఆందోళన కల్గిస్తున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 17, 2023, 11:45 AM IST
Summer Temperatures: మరో 3 రోజులు భారీగా ఉష్ణోగ్రత, బయటకు వెళ్లవద్దని ఐఎండీ హెచ్చరికలు

Summer Temperatures: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో గత కొద్దిరోజులుగా ఉష్ణోగ్రత ఒక్కసారిగా పెరిగిపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండ తీవ్రతతో పాటు వడగాల్పులు భయాందోళనకు గురి చేస్తున్నాయి. రానున్న రోజుల్లో పరిస్థితి ఇంతకంటే విషమించవచ్చని తెలుస్తోంది. 

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఇవాళ, రేపు వడగాల్పుల ప్రభావం అధికంగా ఉండవచ్చని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఇప్పటికే గత కొద్దిరోజులుగా పగటి ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోయాయి. మరోవైపు వడగాల్పులు భయపెడుతున్నాయి. ఏపీలో ఇవాళ, రేపు ఉష్ణోగ్రతలు 2 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశముందని అంచనా. అటు తెలంగాణలో కూడా పగటి ఉష్ణోగ్రతలు 41-43 డిగ్రీలు నమోదు కావచ్చని తెలుస్తోంది. ఏపీలో 116 మండలాల్లో ఇవాళ, రేపు వడగాల్పుల తీవ్రత అధికంగా ఉండవచ్చని సమాచారం. అనకాపల్లి, ఎన్టీఆర్ జిల్లాల్లో తీవ్రత ఎక్కువగా ఉండవచ్చని అలర్ట్ జారీ అయింది. 

రానున్న 3 రోజుల్లో తెలంగాణ, ఏపీల్లో పగటి ఉష్ణోగ్రతలు పెరగడమే కాకుండా వడగాల్పులు అధికంగా ఉండనుండటంతో పగటి సమయంలో బయటకు వెళ్లవద్దని సూచిస్తున్నారు. మఖ్యంగా వృద్ధులు, చిన్నారులు ఎండలో వెళ్లకూడదు. ఇదే సమయంలో ఒడిశా నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడటంతో రాష్ట్రంలో ఒకట్రెండు ప్రాంతాల్లో వడగండ్ల వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. 

Also read: Viveka Murder Case: వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు, తండ్రి అరెస్టు తరువాత కొడుక్కి నోటీసులు జారీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News