Narayana Bail: మాజీ మంత్రి నారాయణకు ఊరట... పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో బెయిల్...

SSC Paper Leak Case - Narayana gets Bail: చిత్తూరు మెజిస్ట్రేట్ మాజీ మంత్రి నారాయణకు బెయిల్ మంజూరు చేసింది. పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో పోలీసులు ఆయనపై మోపిన అభియోగాలను మెజిస్ట్రేట్ తోసిపుచ్చారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 11, 2022, 07:07 AM IST
  • మాజీ మంత్రి నారాయణకు బెయిల్ మంజూరు
  • నారాయణ తరుపు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన మెజిస్ట్రేట్
  • పోలీసులు అభియోగాన్ని తోసిపుచ్చి బెయిల్ మంజూరు చేసిన మెజిస్ట్రేట్
Narayana Bail: మాజీ మంత్రి నారాయణకు ఊరట... పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో బెయిల్...

SSC Paper Leak Case - Narayana gets Bail: పదో తరగతి ప్రశ్రాపత్రాల లీక్ కేసులో అరెస్టయిన మాజీ మంత్రి నారాయణకు ఊరట లభించింది. చిత్తూరు మెజిస్ట్రేట్ సులోచనా రాణి నారాయణకు బెయిల్ మంజూరు చేశారు. వ్యక్తిగత పూచీకత్తుతో పాటు రూ.1 లక్షల చొప్పున ఇద్దరు వ్యక్తులు జామీను ఇవ్వాలన్న షరతుపై బెయిల్ ఇచ్చారు. 2014లోనే నారాయణ విద్యా సంస్థల ఛైర్మన్ పదవి నుంచి నారాయణ తప్పుకున్నారని ఆయన తరుపు న్యాయవాదులు చేసిన వాదనతో మెజిస్ట్రేట్ ఏకీభవించారు. న్యాయవాదులు సమర్పించిన ఆధారాలతో సంతృప్తి చెందిన మెజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలిచ్చారు.

బెయిల్ మంజూరు అనంతరం నారాయణ తరుపు న్యాయవాది ఒకరు మాట్లాడుతూ... నారాయణపై మోపిన అభియోగం నమ్మే విధంగా లేదని మెజిస్ట్రేట్ ఒక అభిప్రాయానికి వచ్చారన్నారు. నారాయణ ప్రస్తుతం నారాయణ విద్యా సంస్థల అధినేతగా ఉన్నారని పేర్కొంటూ పోలీసులు ఆయనపై అభియోగం మోపారని... కానీ 2014లోనే ఆయన ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారని మెజిస్ట్రేట్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. తమ వాదనతో ఏకీభవించి మెజిస్ట్రేట్ నారాయణకు బెయిల్ మంజూరు చేసిందన్నారు.

పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం :

హైదరాబాద్ కేపీహెచ్‌బీలోని లోధా అపార్ట్‌మెంట్‌లో ఉన్న నారాయణ నివాసంలో మంగళవారం (మే 10) సీఐడీ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి ఏపీకి తరలించారు. ఏప్రిల్ 27న చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం నెల్లేపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల నుంచి పదో తరగతి తెలుగు ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో నారాయణ పాత్ర ఉన్నట్లు తేలిందని.. అందుకే ఆయన్ను అరెస్ట్ చేశామని ఏపీ పోలీసులు తెలంగాణ పోలీసులకు సమాచారమిచ్చారు. నారాయణను చిత్తూరుకు తరలించి... అక్కడి ప్రభుత్వాసుపత్రిలో పరీక్షల అనంతరం మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు. ఈ వ్యవహారంలో బెయిల్ లభించడంతో నారాయణకు ఊరట లభించినట్లయింది. 

Also Read: Horoscope Today May 11 2022: రాశి ఫలాలు.. ఇవాళ ఈ రాశుల వారికి ఆశాజనకమైన ఫలితాలు ఉంటాయి...

Also Read: Cyclone Asani Live Updates: అసని తుపాన్‌తో పలు రైళ్ల రద్దు, ఇంకొన్ని దారి మళ్లింపు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News