ఫొని తుపాను ముంచుకొస్తున్న ఈ నేపథ్యంలో విశాఖలో ప్రస్తుతం గంటకు 50 మేర బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి . దీంతో విశాఖ ఎయిర్ పోర్టులో విమానాల ల్యాండింగ్ కు వాతావరణం సహకరించడం లేదు. ఈ క్రమంలో కోల్ కతా -విశాఖ ఎయిరిండియా ల్యాండింగ్ కు అంతరాయం ఏర్పడింది. ల్యాండింగ్ రెండు సార్లు విఫలయత్నం చేసింది. దీంతో అధికారులు ఆ విమానాన్ని భువనేశ్వర్ కు తరలించారు.తాాజా పరిణామంతో విశాఖ చేరుకోవాల్సిన ప్రయాణికులు భువనేశ్వర్ ఎయిర్ పోర్టులో పడిగాపులు గాస్తున్నారు