Talliki Vandanam Scheme: తల్లికి వందనంపై కీలక ప్రకటన.. ఎంత మంది ఉంటే వారికి రూ.15 వేలు

Everyone Gets Talliki Vandanam Scheme Rs 15k Financial Assistance Says Nara Lokesh: చదువుకునే పిల్లలకు ఎంత మందికి తల్లికి వందనం పథకం ఆర్థిక సహాయం అందిస్తారనే విషయమై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jul 24, 2024, 02:42 PM IST
Talliki Vandanam Scheme: తల్లికి వందనంపై కీలక ప్రకటన.. ఎంత మంది ఉంటే వారికి రూ.15 వేలు

Talliki Vandanam Scheme: ఎన్నికల్లో ఇచ్చిన కీలక హామీపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసింది. తల్లికి వందనం పథకంపై అసెంబ్లీ వేదికగా కీలకమైన ప్రకటన విడుదల చేసింది. ఆ పథకంపై వస్తున్న పుకార్లు, ప్రచారంపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. అసెంబ్లీ సమావేశాల వేదికగా మంత్రి నారా లోకేశ్‌ ప్రకటన చేశారు. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి ఈ పథకం వర్తిస్తుందని ప్రకటించారు.

Also Read: Pawan Vs Jagan: ఛీ కొట్టినా జగన్‌ నీకు బుద్ధి రాదా? మాజీ ముఖ్యమంత్రిపై పవన్‌ కల్యాణ్‌ ఆగ్రహం

ఎన్నికల్లో ప్రజలకు ఆకట్టుకున్న హామీ తల్లికి వందనం పథకం. ఇంట్లో ఎంత మంది చదువుకునే వారు ఉంటే వారందరికీ రూ.15 వేల ఆర్థిక సహాయం అందిస్తామని మంత్రి నారా లోకేశ్‌ ప్రకటించారు. ఏపీ శాసనమండలి సమావేశాల్లో బుధవారం జరిగిన చర్చలో లోకేశ్‌ మాట్లాడారు. తల్లికి వందనం పథకంపై స్పష్టత ఇచ్చారు. 'ప్రతి బిడ్డకు రూ.15,000 ఇస్తాం. తల్లికి వందనం పథకం ఎంత మంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇస్తాం. హామీలో చెప్పినట్టు ప్రతి బిడ్డకు రూ.15,000 ఇస్తాం. ఇది ప్రైవేటు, గవర్నమెంట్ పాఠశాల విద్యార్థులు ఎవరు ఉన్నా వారికి తల్లికి వందనం పథకం వర్తిస్తుంది' అని నారా లోకేశ్‌ తెలిపారు.

Also Read: YS Jagan Warning: పోలీసులపై రెచ్చిపోయిన మాజీ సీఎం జగన్‌.. గుర్తుంచుకో అంటూ వార్నింగ్‌

 

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మహిళలకు తెలుగుదేశం, జనసేన పార్టీలు తల్లికి వందనం పథకం హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన అనంతరం కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకం హామీని నిలబెట్టుకునే పనిలో పడింది. విద్యార్థుల తల్లులకు రూ.15 వేలు వార్షిక ఆర్థిక సహాయం అందించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తల్లికి వందనం పథకం మార్గదర్శకాలు విడుదల చేసింది. పథకానికి అర్హులు ఎవరు? పథకం పొందాలంటే ఏయే పత్రాలు ఉండాలో అనే వివరాలు ప్రభుత్వం సూత్రప్రాయంగా తెలిపింది.

పేదరికం కారణంగా ఏ ఒక్క పిల్లవాడు చదువుకు దూరం కాకూడదనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం అనే పథకాన్ని ప్రారంభించనుంది. ఈ పథకం అమలుతో తల్లిదండ్రులు తమ పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలకు పంపిస్తారని ఆశిస్తోంది. చదువు మధ్యలో మానేసే విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతుందనే ఉద్దేశంతో ఈ పథకం అమలు చేయనుంది. 

పథకం మార్గదర్శకాలు ఇవే?
ఈ పథకం ద్వారా 1 నుంచి 12వ తరగతి (ఇంటర్మీడియట్‌) వరకు చదువుతున్న విద్యార్థుల తల్లులకు ప్రభుత్వం నేరుగా రూ.15,000 వార్షిక ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ పథకం పొందాలంటే దారిద్య్ర రేఖ దిగువన ఉండాలని తెలుస్తోంది. బీపీఎల్‌ కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుందని సమాచారం. అయితే ఈ పథకం పొందాలంటే రేషన్ కార్డును ప్రామాణికంగా ఈ పథకం అమలు చేయనున్నారు. విద్యార్థుల హాజరు తప్పనిసరిగా 75 శాతానికి మించి ఉండాలని విద్యా శాఖ అధికారులు చెబుతున్నారు. ఆర్థిక సహాయంతోపాటు స్టూడెంట్ కిట్స్ జారీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే తల్లికి వందనం పథకానికి సంబంధించిన విషయమై ప్రభుత్వం త్వరలోనే ఒక స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News