విజయవాడ అగ్నిప్రమాద సంఘటనపై ఏపీ ప్రభుత్వం చర్యలకు దిగుతోంది. ఘటనకు బాధ్యులెవరో గుర్తించేందుకు విచారణ కమిటీ ఏర్పాటైంది. ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం ఉందనేది ప్రాధమిక దర్యాప్తులో తేలినట్టు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు.
విజయవాడ కోవిడ్ సెంటర్ లో జరిగిన అగ్నిప్రమాదం దేశవ్యాప్తంగా ఉలిక్కిపడేలే చేసింది. ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా రోగుల కోసం విజయవాడలోని ఓ హోటల్ ను ఓ ప్రైవేటు ఆసుపత్రి లీజుకు తీసుకుని కోవిడ్ సెంటర్ గా నడుపుతున్న విషయం తెలిసిందే. ఈ హోటల్ లోనే ప్రమాదం జరిగింది. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని ఘటనా ప్రాంతాన్ని సందర్శించి...అధికార్లతో సమీక్ష నిర్వహించారు. విచారణకు ఆదేశించడమే కాకుండా..కమిటీను ఏర్పాటు చేశామని..48 గంటల్లో నివేదిక ఇవ్వాలని కమిటీను ఆదేశించినట్టు మంత్రి నాని చెప్పారు. ప్రాధమిక దర్యాప్తులో రమేష్ ఆసుపత్రి నిర్లక్ష్యం ఉన్నట్టు తేలిందన్నారు. ప్రమాద బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని...ఇప్పటికే హోటల్, రమేష్ ఆసుపత్రిపై కేసు నమోదు చేసినట్టు మంత్రి స్పష్టం చేశారు. 304, 308 రెడ్ విత్ సెక్షన్ 34 కింద కేసు నమోదైంది. ప్రమాదంపై నివేదిక వచ్చిన తరువాత విజయవాడలోని అన్ని ప్రైవేటు ఆసుపత్రులపై డ్రైవ్ నిర్వహించనున్నట్టు మంత్రి ఆళ్లనాని చెప్పారు. Also read: AP: విజయవాడ ప్రమాదంపై సీఎం జగన్ కు ప్రధాని మోదీ ఫోన్
అటు హోంమంత్రి మేకతోటి సుచరిత కూడా ఈ ఘటనపై స్పందించారు. ప్రమాదానికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. 48 గంటల్లో కమిటీ నివేదిక అందిస్తుందన్నారు.