కృష్ణా నదిలో నలుగురు విద్యార్థులు గల్లంతు

కృష్ణా జిల్లా ఇబ్రహీం పట్నం ప్రాంతంలోని పవిత్ర సంగమం వద్ద ఈ రోజు నదీ స్నానానికి వెళ్లిన నలుగురు యువకులు గల్లంతయ్యారు. 

Last Updated : Jun 23, 2018, 06:00 PM IST
కృష్ణా నదిలో నలుగురు విద్యార్థులు గల్లంతు

కృష్ణా జిల్లా ఇబ్రహీం పట్నం ప్రాంతంలోని పవిత్ర సంగమం వద్ద ఈ రోజు నదీ స్నానానికి వెళ్లిన నలుగురు యువకులు గల్లంతయ్యారు. వీరందరూ కూడా ఇంజనీరింగ్ విద్యార్థులే. తొలుత ఒకరు నదిలో దిగి.. లోతు ఎక్కువగా ఉన్న చోట మునిగిపోగా.. అతనిని కాపాడడానికి వెళ్లిన ముగ్గురు కూడా గల్లంతయ్యారు. ఈ విషయాన్ని చూసిన మరో విద్యార్థి స్థానికులకు సమాచారం అందించగా వారు పోలీసులకు తెలియజేశారు.

పోలీసుల అభ్యర్థన మేరకు హుటాహుటిగా రంగంలోకి దిగిన ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందితో పాటు గజ ఈతగాళ్లు నది మొత్తం గాలింపు చర్యలు చేపట్టారు. విద్యార్థుల గల్లంతు గురించి తెలుసుకొని కృష్ణా జిల్లా ఇన్ ఛార్జి కలెక్టర్ విజయ్ క్రిష్ణ సంఘటనా స్థలానికి చేరి పరిస్థితిని గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఈ విషయం గురించి విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడేందుకు యంత్రాంగం ప్రయత్నిస్తోంది.

నదిలో విద్యార్థుల గల్లంతు వార్త తన దృష్టికి రాగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టి.. బాధిత కుటుంబాలను సందర్శించాలని కలెక్టరును ఆదేశించారు. ఈ ఘటన పై సమగ్ర నివేదికను అందజేయాలని కోరారు.

పవిత్ర సంగమం వద్ద గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయని.. మరల ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని అధికారులకు సీం ఆదేశించారు. ఈ ఘటనలో గల్లంతైన విద్యార్థులందరూ కూడా కంచికర్లలోని ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నట్లు సమాచారం.

Trending News