Cyclone Warning: ఏపీకు తుపాను హెచ్చరిక, ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు తస్మాత్ జాగ్రత్త

Cyclone Warning: ఓ వైపు పెరుగుతున్న చలి, మరోవైపు పొంచి ఉన్న భారీ వర్షాలతో ఏపీలో వాతావరణం పూర్తిగా మారిపోనుంది. ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 19, 2024, 07:27 PM IST
Cyclone Warning: ఏపీకు తుపాను హెచ్చరిక, ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు తస్మాత్ జాగ్రత్త

Cyclone Warning: ఆంధ్రప్రదేశ్‌కు తుపాను ముప్పు పొంచి ఉందని ఐఎండీ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఈ నెల 23న ఏర్పడనున్న అల్పపీడనం 27వ తేదీకు తుపానుగా మారనుంది. ఫలితంగా ఈ నెలాఖరులో దక్షిణ కోస్తా జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ బంగాళాఖాతంలోని అండమాన్ ప్రాంతంలో ఈ అల్పపీడనం ఏర్పడనుంది.

ఏపీలో మరోసారి అత్యంత భారీ వర్షాలు పడనున్నాయి. బంగాళాఖాతంలో ఈ నెల 23న ఏర్పడనున్న అల్పపీడనం 27 నాటికి తుపానుగా బలపడనుంది. ఆ తరువాత 28వ తేదీన చెన్నై-నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశాలున్నాయి. తుపాను ప్రభావంతో నవంబర్ 24 నుంచి రాయలసీమ జిల్లాల్లో ముఖ్యంగా తిరుపతి, చిత్తూరులోనూ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఆ తరువాత నవంబర్ 27, 28, 29 తేదీల్లో దక్షిణ కోస్తాలోని నెల్లూరు, ఒంగోలు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడనున్నాయి. అల్పపీడనం తుపానుగా బలపడిన తరువాత తీరం దాటేది చెన్నై-నెల్లూరు మధ్యే కావడంతో నెల్లూరు, ఒంగోలు జిల్లాలపై భారీ ప్రభావం ఉంటుంది. అటు చెన్నైలో కూడా ఈ నెల 27 నుంచి 29 వరకూ భారీ వర్షాలు పడనున్నాయి. 

తీరం దాటే సమయంలో తీర ప్రాంతంలో నెల్లూరు, చెన్నై మధ్యన సముద్రంలో కెరటాల హోరు ఎక్కువగా ఉంటుంది. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. తుపాను తీవ్ర తుపానుగా మారనుందా లేదా అనేది ఇంకా తెలియదని ఐఎండీ వెల్లడించింది. 

Also read: Flipkart Offers: కళ్లు చెదిరే ఆఫర్, 50MP కెమేరా 6జిబి ర్యామ్ Samsung Galaxy A14 కేవలం 10 వేలకే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News