NTR Vardhanthi: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజుపై మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ సంచయిత మరోసారి మండిపడ్డారు. ఎన్టీఆర్ పై కుట్ర పన్నిన ఐదుగురిలో అశోక్ గజపతి రాజు ఒకరని స్పష్టం చేశారు.
ఓ వైపు ఎన్టీఆర్ ( NTR ) మరణానికి కారణమై..మరోవైపు ఎన్టీఆర్ వర్ధంతి ( NTR Vardhanthi ) జరుపుకోవడం హాస్యాస్పదంగా ఉందని మాన్సాస్ ట్రస్ట్ ( Mansas trust ) ఛైర్మన్ సంచయిత మండిపడ్డారు. ఎన్టీఆర్‌పై కుట్రలు చేసినవారిలో ఒకరైన అశోక్ గజపతి రాజు ( Ashok gajapati raju ) వర్ధంతి సందర్భంగా కొనియాడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు సంచయిత. పార్టీని స్థాపించి..తనంతటతానుగా అధికారంలో వచ్చిన ఎన్టీఆర్‌ను పదవి నుంచి తప్పించడమే కాకుండా ఆయన మరణానికి కారణమైన వ్యక్తుల్లో చంద్రబాబు ( Chandrababu )తో పాటు అశోక్ గజపతిరాజు కూడా ఒకరని సంచయిత గుర్తు చేశారు. ఈ క్రమంలో కుట్రకు పాల్పడిన ఐదుగురిని పార్టీ నుంచి బహిష్కరించానని చెబుతూ స్పీకర్‌కు రాసిన లేఖను సంచయిత (Sanchaita ) విడుదల చేశారు.
నాటి కుట్రలో చంద్రబాబు సహా అశోక్ గజపతిరాజు, మాధవ్ రెడ్డి ( Madhav reddy ), దేవేందర్ గౌడ్ ( Devender goud ), కోటగిరి విద్యాధర్‌రావు ( Kotagiri vidyadhar rao ) లు ఉన్నారని సంచయిత తెలిపారు. ఈ ఐదుగురిని ఎమ్మెల్యే పదవుల్నించి సైతం తప్పించాలని కోరుతూ నాటి స్పీకర్‌కు ఎన్టీఆర్ స్వయంగా లేఖ ( Ntr letter to speaker ) రాశారు. ఆ లేఖను సంచయిత విడుదల చేశారు. రాజకీయ సూత్రాల్ని, నైతిక విలువల్ని, ప్రజలిచ్చిన తీర్పును మంటగలిపిన అశోక్ గజపతిరాజు..ఎన్టీఆర్ ఆరాధ్యదైవమంటూ వర్ధంతి నాడు కొనియాడటమనేది..ఓ వ్యక్తిని హత్య చేసి..ఆ వ్యక్తి దూరమయ్యాడంటూ కన్నీరు పెట్టడం లాంటిదని ఎద్దేవా చేశారు.
Also read: AP: చంద్రబాబుపై హాట్ కామెంట్స్ చేసిన జేసీ దివాకర్ రెడ్డి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook