హోదా గురించి జర పట్టించుకోండి సారూ

రాజ్యసభ: ప్రత్యేక హోదాపై బీజేపీ అనుసరిస్తున్న వైఖరిని కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది 

Last Updated : Mar 20, 2018, 03:59 PM IST
హోదా గురించి జర పట్టించుకోండి సారూ

ప్రత్యేక హోదా అంశంపై విపక్షాలను ఏకతాటిపై తెచ్చేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్.. రాజ్యసభలోనూ బలంగా తన వాణి వినిస్తోంది.  ఈ అంశంపై గులాం నబి ఆజాద్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించేందుకు జరుగుతున్న ఆందోళనలను మోడీ సర్కార్ పట్టించుకోవడం లేదని విమర్శించారు. దేశంలోని పది పార్టీలు ఒకే అంశంపై పోరాడుతున్న కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. హోదాపై తక్షణమే చర్చ చేపట్టి ఏపీకి న్యాయం చేయాలని ఆజాద్ కోరారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని పార్లమెంట్‌ సాక్షిగా అప్పట్లో ప్రధానమంత్రి ఇచ్చిన హామీ అమలుకావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఆ హక్కు కాంగ్రెస్‌కు లేదు
ఆజాద్ వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు. హోదాపై స్పందించే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. కాంగ్రెస్ పార్టీయే ఏపీకి అన్యాయం చేసిందని ఎదురుదాడి చేశారు.  విభజన చట్టంలో హోదా అంశం లేకపోవడం వల్లే ఏపీకి ఈ పరిస్థితి వచ్చిందని.. ఏపీ కష్టాలకు కారణం కాంగ్రెస్ పార్టీయేనన్నారు. రవిశంకర్ వ్యాఖ్యలను  విపక్షాలు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగడంతో రాజ్యసభ బుధవారానికి వాయిదా పడింది.

Trending News