మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి విమర్శల పర్వం కొనసాగిస్తున్నారు. చంద్రబాబు హయంలో ప్రజా ధనం దుర్వినియోగం చేశారని....ప్రభుత్వ నిధులు దుబారా ఖర్చులకు పాల్పడ్డారంటూ ఆరోపణాస్త్రాలు సంధించారు. ప్రభుత్వం భవనాల అద్దెల చెల్లింపులో వందల కోట్ల అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. నక్కల రోడ్డులోని పంచాయతీ రాజ్. గ్రామీణాభివృద్ధి శాఖ ఆఫీసుకు ఐదు లక్షల లోపే అద్దె చెల్లించేవారని... దాన్ని రూ.30 లక్షల అద్దె బిల్డింగులోకి షిఫ్ట్ చేశారని ఉదాహరణగా చెబుతూ ప్రజల సొమ్ము అంటే ఇంత చులకనా బాబూ ? అంటూ విజయసాయి ప్రశ్నించారు.
జగన్ పాలన భేష్....
ఇదే సందర్భంలో చంద్రబాబు పాలనతో పోల్చుతూ వైఎస్ జగన్ పాలనను విజయసాయిరెడ్డి సమర్ధించారు. అక్రిడేటేడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్టు (ఆశా) సోదరీమణులపై చంద్రబాబు ప్రభుత్వం అమానుషంగా వ్యవహరించిందని...హాక్కుల కోసం గళం విప్పినందుకు అరెస్టులు చేసి హింసలు పెట్టిందని విజయసాయి రెడ్డి దయ్యబట్టారు. ఈ సందర్భంగా జగన్ పాలనను ప్రస్తావిస్తూ ఆశా సిస్టర్ల వేతనాన్ని రూ .3 వేల నుంచి ఒకే సారి 10 వేలకు పెంచి 50 వేల కుటుంబాల్లో వెలుగులు నింపారని వైఎస్ జగన్ పాలనను విజయసాయిరెడ్డి సమర్ధించారు.
ఆఫీసుల అద్దె చెల్లింపుల్లో చంద్రబాబు ప్రభుత్వం వందల కోట్ల అవినీతికి పాల్పడింది. నక్కల రోడ్డులోని పంచాయతీ రాజ్. గ్రామీణాభివృద్ధి శాఖ ఆఫీసుకు ఐదు లక్షల లోపే అద్దె చెల్లించేవారు. దాన్ని రూ.30 లక్షల అద్దె బిల్డింగులోకి షిఫ్ట్ చేశారు. ప్రజల సొమ్ము అంటే ఇంత చులకనా బాబూ?
— Vijayasai Reddy V (@VSReddy_MP) June 4, 2019
ఆశా సిస్టర్ల వేతనాన్ని రూ.3 వేల నుంచి ఒకే సారి 10 వేలకు పెంచి వైఎస్ జగన్ గారు 50 వేల కుటుంబాల్లో వెలుగులు నింపారు. అక్రిడేటేడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్టు(ఆశా) సోదరీమణులపై చంద్రబాబు ప్రభుత్వం అమానుషంగా వ్యవహరించింది. అరెస్టులు చేసి హింసలు పెట్టారు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) June 4, 2019
జగన్ గారి సమీక్షల తీరు పట్ల అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏ విషయమైనా గంటల్లో తేల్చేస్తున్నారు. వారందరికీ లంచ్ సీఎం గారింట్లోనే. తన కోసం తయారు చేసిందే అందరికీ పెట్టాలని చెప్పడం, తమతో వ్యవహరించే తీరు ఆయన గొప్ప సంస్కారాన్ని చాటుతున్నాయని అధికారులు చెప్పుకుంటున్నారు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) June 3, 2019