Chandrababu Amaravati Tour: తాను శంకుస్థాపన చేసిన నవ్యాంధ్ర రాజధాని ఐదేళ్ల తర్వాత విధ్వంసమైంది. వేసిన పునాది చెరిగిపోయింది. ఐదేళ్ల తర్వాత మళ్లీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటించనున్నారు. ఎంతో ప్రణాళికతో.. ఎన్నో ఆలోచనలతో తాను రూపకల్పన చేసిన రాజధాని ప్రాంతం ఎలా ఉందో చూసేందుకు చంద్రబాబు సంకల్పించారు. మళ్లీ రాజధాని నిర్మాణానికి బాటలు వేయనున్నారు.
ముఖ్యమంత్రి హోదాలో తన రెండో పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు రాజధాని ప్రాంతంలో పర్యటించనున్నారు. రాజధాని ప్రాంతంలో నిర్మాణాల స్థితిగతులను పరిశీలించనున్నారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి గురువారం ఉదయం 11 గంటలకు బయలుదేరుతారు. ఉండవల్లిలో సీఎం జగన్ కూల్చివేసిన ప్రజావేదిక నుంచి ముఖ్యమంత్రి పర్యటన ప్రారంభం కానుంది.
Also Read: AP Ration Items: పేదలకు చంద్రబాబు గుడ్‌న్యూస్.. రేషన్ సరుకుల్లో బియ్యంతోపాటు చక్కెర, పప్పు
కూల్చిన చోట నుంచే..
అనంతరం ఉద్దండరాయునిపాలెంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శిస్తారు. అక్కడి నుంచి సీడ్ యాక్సిస్ రోడ్, ఆలిండియా సర్వీసెస్ అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాలు, ఇతర నిర్మాణాలను చంద్రబాబు స్వయంగా పరిశీలించనున్నారు. ఐకానిక్ భవనాల నిర్మాణాల కోసం నాడు పనులు మొదలు పెట్టిన సైట్‌లను కూడా తిలకించనున్నారు. పర్యటన అనంతరం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడతారు.
జగన్‌పై ఎలా స్పందిస్తారో?
రాజధాని ప్రాంతంలో నిర్మాణ సామగ్రి దొంగతనం.. అస్తవ్యస్తంగా భవనాల నిర్మాణం వంటి వాటిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకోనున్నారు. అయితే కొన్ని నిర్మాణ స్థలాల్లో కబ్జాలకు గురయిన వాటిపై కూడా ఆరా తీసే అవకాశం ఉంది. ఇదే క్రమంలో రాజధానికి తమ పొలాలు ఇచ్చిన నిర్వాసితులతో కూడా చంద్రబాబు సమావేశమయ్యేలా ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు అమరావతి పర్యటన ఉత్కంఠ రేపుతోంది. పర్యటనలో గత జగన్ ప్రభుత్వంపై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారోనని ఆసక్తికరంగా ఉంది.
షెడ్యూల్ ఇదే..
- ఉండవల్లి ప్రజావేదిక నుంచి పర్యటన ప్రారంభం
- ఉద్దండరాయుని పాలెంలో రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతం సందర్శన
- అనంతరం సీడ్ యాక్సిస్ రోడ్డు పరిశీలన
- ఆలిండియా సర్వీసెస్ అధికారుల గృహ సముదాయాలు పరిశీలన
- మంత్రులు, జడ్జిల గృహ సముదాయాలు పరిశీలించనున్న చంద్రబాబు
- ఐకానిక్ నిర్మాణాల కోసం పనులు మొదలుపెట్టిన సైట్లు పరిశీలన
- రాజధాని ప్రాంతంలో నిర్మాణాల స్థితిగతులను పరిశీలించనున్న సీఎం
- అనంతరం విలేకరుల సమావేశం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter