Divyavani Comments: టీడీపీకి ఆ పార్టీ నేత, సినీ నటి దివ్య వాణి రాజీనామా చేశారు. ఈసందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో తనకు తగిన గుర్తింపు లేదన్నారు. తన గురించి కొందరూ అసత్య ప్రచారం చేస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. ప్యాకేజీ అందింది..అందుకే రాజీనామా చేయడం లేదని అంటున్నారని వాపోయారు. చివరి నిమిషం వరకు క్లారిటీ తీసుకునేందుకు ఆగానని స్పష్టం చేశారు.
ఏడాది నుంచి టీడీపీలో తనకు సరైన గుర్తింపు లేదని చెప్పారు. తాను ఎవరికీ భజన చేయనని.. ఆ పార్టీ అధినేత చంద్రబాబును కొందరూ రాంగ్ రూట్‌లోకి తీసుకెళ్తున్నారన్నారు. కొందరు జర్నలిజం పేరుతో నానా మాటలు అన్నారని..కొందరు మహిళా నేతలు తనకు ఫోన్ చేసి తిట్టారని చెప్పారు. టీడీపీలో ప్రెస్‌మీట్ పెట్టాలంటే మాముళ్లు ఇవ్వాలి..అలా మాముళ్లు ఇవ్వడం తనకు తెలియదని హాట్ కామెంట్ చేశారు.
ప్రజా సేవ కోసమే రాజకీయాల్లో వచ్చానని దివ్య వాణి స్పష్టం చేశారు. టీడీపీ ఆఫీస్ బాయ్ తనను ఆపడం ఏంటని ప్రశ్నించారు. టీడీ జనార్ధన్ అనే వ్యక్తిని ప్రశ్నిస్తే నరకం చూపిస్తారా అని అన్నారు. మహానాడులో ఎన్టీఆర్ గురించి మాట్లాడుతానని అయ్యన్నపాత్రుడుతోపాటు ఇతరులకు చెప్పినా ప్రయోజనం లేదన్నారు. టీడీపీలో పొమ్మనలేక పొగబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.
పదవుల కోసం తాను ఎప్పుడు పాకులాడలేదని స్పష్టం చేశారు. మహానాడులో తనను మాట్లాడించకుండా అవమానించారన్నారు దివ్య వాణి. చంద్రబాబు పర్సనల్ పీఏ రాజగోపాల్‌కు నార్కో టెస్ట్ పెట్టాలని డిమాండ్ చేశారు. తనకు జరిగిన అవమానాలన్నీ చంద్రబాబుకు వివరించారన్నారు. తన భవిష్యత్‌ను కాలమే నిర్ణయిస్తుందని చెప్పారు. ప్రజా సేవ కోసమే తాను ఉన్నానని తెలిపారు.
Also read:Hardik Patel: ప్రధాని మోదీ కోసం సైనికుడిగా పనిచేస్తా..నేడు బీజేపీలోకి హార్దిక్ పటేల్..!
Also read:Sonia Gandhi Covid 19: కరోనా బారినపడిన సోనియా గాంధీ... ప్రస్తుతం ఐసోలేషన్‌లో...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook