స్వరం మారిందో... వ్యూహం మారిందో కానీ చంద్రబాబు నోట ఈ రోజు ఆసక్తికర మాట బయటికి వచ్చింది. ఈ రోజు అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు మాట్లాడతూ తాను వైఎస్‌ఆర్ ఆప్తమిత్రులమని పేర్కొన్నారు. ఇంతటితో ఆగకుండా వైఎస్ తన ప్రాణ స్నేహితుడు..తమ మధ్య రాజకీయ వైరం తప్పితే వ్యక్తిగత విభేదాలు లేవన్నారు. మంత్రిగా ఉన్నప్పుడు తాము ఒకే రూములో ఉండే వాళ్లమని చంద్రబాబు గతాన్ని గుర్తు చేసుకున్నారు.
వైఎస్ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే..
ఈ రోజు అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా వేదిక కూల్చివేత అంశంపై చంద్రబాబు స్పందిస్తూ అక్రమ కట్టడం అనే కారణాన్ని చూపుతూ ప్రజా వేదికను కూల్చివేసిన వైసీపీ సర్కార్ రాష్ట్రంలోని ఇతర అక్రమ కట్టడాలతో పాటు రహదారులపై అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన విగ్రహాల కూల్చివేత పై కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. వైఎస్ విగ్రహాలను కూల్చి వేయాలని ప్రతిపక్షనేత పరోక్షంగా వ్యాఖ్యానిస్తున్నారంటూ అధికార పార్టీకి చెందిన శాసనసభలో ఆందోళన చేశారు.
చంద్రబాబు వివరణ...
ఈ సందర్భంలో సభలో గంరగోళం నెలకొన్న క్రమంలో చంద్రబాబు వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ వైఎస్ విగ్రహాల పట్ల తనకేమీ అసూయలేదని .. వాటిని కూల్చి వేయాలని కూడా తాను ఎక్కడా డిమాండ్ చేయడం లేదని తెలిపారు. అక్రమంగా ఉన్న నిర్మణాలు, విగ్రహాల కూల్చివేతను మాత్రమే తాను డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ పట్ల తనకున్న అనుబంధాన్ని చంద్రబాబు గుర్తు చేశారు