Chandrababu Kuppam Tour: అఖండ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు నాయుడు తొలిసారి తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్నారు. దీంతో కుప్పంలో కోలాహల వాతావరణం ఏర్పడింది. తొమ్మిది పర్యాయాలు ఎమ్మెల్యేగా కుప్పం నుంచి గెలుస్తున్న చంద్రబాబు నాలుగోసారి సీఎం పదవిని అధిష్టించిన విషయం తెలిసిందే. అయితే గతం కంటే భారీ మెజార్టీతో విజయం సాధించిన చంద్రబాబు తన నియోజకవర్గ ఓటర్లకు కృతజ్ఞతలు తెలపనున్నారు. అంతేకాకుండా నియోజకవర్గానికి భారీ నిధులు, హామీల వర్షం కురిపించనున్నారని సమాచారం. ఈ మేరకు చంద్రబాబు పర్యటన షెడ్యూల్ విడుదల ఇలా ఉంది.
రెండు రోజుల పాటు చంద్రబాబు కుప్పంలో పర్యటించనున్నారు. ఈ నెల 25, 26వ తేదీల్లో సీఎం పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. అధికారులందరూ సమన్వయంతో ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేసేందుకు చర్యలు తీసుకున్నారు. కుప్పం తహసీల్దార్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, డీఎఫ్ఓ చైతన్య కుమార్ రెడ్డితో కలిసి కలెక్టర్ సుమిత్ కుమార్ సమీక్ష నిర్వహించారు.
Also Read: Hyper Aadi: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను వాడేసుకుంటున్న కమెడియన్ హైపర్ ఆది
జిల్లా అధికార యంత్రాంగం, పోలీసులు అత్యంత అప్రమత్తతో ఉన్నారని కలెక్టర్ తెలిపారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా హెలిప్యాడ్, పార్కింగ్ వంటి ప్రదేశాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు పరిశీలించారు. ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది రాకుండా.. పోలీస్, రెవెన్యూ, ఆర్ అండ్ బీ అధికారులు కలిసి పరిశీలన చేసి బ్యారికేడ్‌లు ఏర్పాటు చేశారు. అగ్నిమాపక సిబ్బంది కూడా అందుబాటులో ఉంచారు. చంద్రబాబు పర్యటనకు వచ్చే ప్రజలకు నాక్స్, నీటి ప్యాకెట్స్, మజ్జిగ పంపిణీ చేయనున్నారు. వైద్య శిబిరం, గ్రీవెన్స్ డెస్క్‌లు కూడా ఏర్పాటుచేశారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా విద్యుత్ సిబ్బంది నిరంతరం పని చేస్తున్నారు.
చేరికలు
అధికారం కోల్పోయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చంద్రబాబు పర్యటనలో టీడీపీలో చేరుతారని సమాచారం. ఆ పార్టీకి చెందిన జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్, ముఖ్య నాయకులు చేరేందుకు సిద్ధమయ్యారు. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ వైసీపీని ఖాళీ చేసేందుకు సిద్ధమయ్యారు. వైనాట్ కుప్పం అని చెప్పిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కుప్పం నుంచే తొలి దెబ్బ తగలనుందని సమాచారం.
చంద్రబాబు కుప్పం షెడ్యూల్
25వ తేదీ మంగళవారం కార్యక్రమాలు
26వ తేదీ బుధవారం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter
Chandrababu Kuppam: కుప్పంలో అభివృద్ధి జాతర.. చంద్రబాబు తొలి పర్యటనకు కనీవినీ ఎరుగని ఏర్పాట్లు