/telugu/photo-gallery/rain-alert-expected-in-these-4-key-districts-of-telugu-states-imd-weather-alert-issued-rn-180901 AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక 180901

Deepam Scheme: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు ప్రభుత్వం దీపం పథకం కింద ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పంపిణీకి సిద్ధమైంది. దీపావళి పండుగ నాడు మహిళలకు సిలిండర్లు అందించేందుకు షెడ్యూల్‌ ప్రకటించింది. ఈ సందర్భంగా సిలిండర్లకు సంబంధించిన నిధులను పెట్రోలియం సంస్థలకు సీఎం చంద్రబాబు నాయుడు అందించారు. దీపావళి కానుకగా సూపర్ సిక్స్ ఉచిత సిలిండర్ల పథకాన్ని అమలు చేస్తామని తెలిపింది. దీపం-2 పథకానికి రూ.2,684 కోట్లు  రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది.

Also Read: YSR Family: వైఎస్‌ విజయమ్మకు వైఎస్సార్‌సీపీ గట్టి కౌంటర్‌.. సంచలనం రేపుతున్న లేఖ

 

దీపం పథకం మొదటి విడతకు అయ్యే ఖర్చు రూ.894 కోట్ల మొత్తాన్ని పెట్రోలియం సంస్థలకు సీఎం చంద్రబాబు బుధవారం అందించారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ప్రకటించిన సూపర్-6 హామీల్లో భాగంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్ల పథకం అమలు చేస్తామని ప్రకటించింది. అమరావతి సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థల ప్రతినిధులకు ఈ రాయితీ మొత్తాన్ని అందించారు.

Also Read: YSR Family Dispute: వైఎస్‌ విజయమ్మ చెప్పిన ఆస్తుల చిట్టా ఇదే.. జగన్, షర్మిలకు రావాల్సిన ఆస్తులివే!

ఏడాదికి మూడు సిలిండర్లు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి దీనికయ్యే రూ.2,684 కోట్ల ఖర్చుకు మంత్రిమండలి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీపం-2 పథకంలో భాగంగా ప్రతి నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున ప్రభుత్వం లబ్ధిదారులకు అందించనుంది. ఏడాదికి మూడు విడతల్లో ప్రభుత్వం మూడు గ్యాస్ సిలిండర్లకు అయ్యే ఖర్చు సొమ్మును విడుదల చేయనుంది. 29వ తేదీ నుంచి ప్రభుత్వం ఈ పథకం కింద గ్యాస్ బుక్ చేసుకునే అవకాశాన్నిలబ్దిదారులకు కల్పించింది.

గ్యాస్ సిలిండర్ అందిన 48 గంటల్లో లబ్ధిదారులు సిలిండర్‌కు వెచ్చించిన సొమ్ము వారి ఖాతాలో జమ కానుంది. కేంద్రం ఇచ్చే రూ.25 రాయితీ పోను మిగిలిన రూ.876లను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. దీపం పథకం అమల్లోకి రావడంతో పేద కుటుంబాల్లో కొంత ఊరట లభించనుంది. అయితే లబ్ధిదారుల ఎంపిక ఎలా ఉంటుందోననే ఆందోళన ప్రజల్లో నెలకొంది. రాజకీయాలకు అతీతంగా ఈ పథకం అమలు చేయాలనే డిమాండ్‌ ప్రజల నుంచి వస్తోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Section: 
English Title: 
Chandrababu Govt Launches Free Gas Cylinder On The Name Of Deepam Scheme Here Is How Much Amount Rv
News Source: 
Home Title: 

Free Gas Cylinder: మహిళలకు దీపావళి పండుగే.. ఉచిత గ్యాస్‌ సిలిండర్లకు చెక్కు అందజేత

Free Gas Cylinder: మహిళలకు దీపావళి పండుగే.. ఉచిత గ్యాస్‌ సిలిండర్లకు చెక్కు అందజేత
Caption: 
Chandrababu Free Gas Cylinder
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Free Gas Cylinder: మహిళలకు దీపావళి పండుగే.. ఉచిత గ్యాస్‌ సిలిండర్లకు చెక్కు అందజేత
Ravi Kumar Sargam
Publish Later: 
No
Publish At: 
Wednesday, October 30, 2024 - 15:29
Created By: 
Ravi Kumar Sargam
Updated By: 
Ravi Kumar Sargam
Published By: 
Ravi Kumar Sargam
Request Count: 
17
Is Breaking News: 
No
Word Count: 
261