ప్రత్యేక హోదా అంశాన్ని టీఆర్ఎస్ మేనిఫెస్టో లో పెట్టించగలరా ? - జగన్ కు చంద్రబాబు సవాల్

                                        

Last Updated : Apr 3, 2019, 08:18 PM IST
ప్రత్యేక హోదా అంశాన్ని టీఆర్ఎస్ మేనిఫెస్టో లో పెట్టించగలరా ? - జగన్ కు చంద్రబాబు సవాల్

నెల్లూరు: కేసీఆర్ తో లింక్ పెడుతూ జగన్ పై ఏపీ సీఎం చంద్రబాబు మరో మారు విమర్శలు సంధించారు . ఉదయగిరిలో ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ మన ప్రతిపక్ష నేత జగన్ తెలంగాణ సీఎం కేసీఆర్ వద్ద కూలి పనిచేస్తున్నారని ఎద్దేవ చేశారు.. ఉదయం చేసిన రాజకీయాలను సాయంత్రం కేసీఆర్ కు రిపోర్ట్ చేయనిదే జగన్ నిద్రపోరని విమర్శించారు.

జగన్ తన రాజకీయాల  గురించి రిపోర్ట్ చేస్తే...అందుకు బదులుగా కేసీఆర్ డబ్బులిస్తారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ తో కుమ్మకైన జగన్.. ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశాన్ని టీఆర్ఎస్ మేనిఫెస్టోలో పెట్టించగలరా ? అంటూ జగన్ కు చంద్రబాబు సవాల్ విసిరారు. కేసీఆర్ తో కుమ్మకై..జగన్ చేస్తున్నరాజకీయాలను  ఏపీ ప్రజలకు గమనిస్తున్నారని.. ప్రజలను మోసం చేసిన జగన్ కు ఎన్నికల్లో బుద్ధిచెబుతారని చంద్రబాబు పేర్కొన్నారు.
 

Trending News