AP: పోలవరం ప్రాజెక్టుపై తొలగిన సందిగ్దత, డీపీఆర్ 2 అధికారికంగా ప్రకటించిన కేంద్రం

ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనరేఖ పోలవరం ప్రాజెక్టు అడ్డంకులు తొలగనున్నాయి.  సవరించిన అంచనాల విషయంలో నెలకొన్న పేచీ దాదాపు తొలగినట్టే కన్పిస్తోంది. పోలవరం అంచనా వ్యయాన్ని అధికారికంగా ప్రకటించడమే దీనికి ఉదాహరణ..

Last Updated : Dec 26, 2020, 05:44 PM IST
  • పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలపై నెలకొన్న సందిగ్దతపై తెర దించిన కేంద్రం
  • ఏపీ ప్రభుత్వానికి గుడ్ న్యూస్ విన్పించిన కేంద్ర ప్రభుత్వం
  • సవరించిన అంచనా వ్యయాన్ని అధికారికంగా ప్రకటించిన కేంద్రం
AP: పోలవరం ప్రాజెక్టుపై తొలగిన సందిగ్దత, డీపీఆర్ 2 అధికారికంగా ప్రకటించిన కేంద్రం

ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనరేఖ పోలవరం ప్రాజెక్టు అడ్డంకులు తొలగనున్నాయి.  సవరించిన అంచనాల విషయంలో నెలకొన్న పేచీ దాదాపు తొలగినట్టే కన్పిస్తోంది. పోలవరం అంచనా వ్యయాన్ని అధికారికంగా ప్రకటించడమే దీనికి ఉదాహరణ..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ( Ap Government ) ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు ఇక త్వరలో పూర్తయ్యేందుకు మార్గం సుగమమైంది. ఈ విషయమై కేంద్రం శుభవార్తను విన్పించింది. సవరించిన అంచనా వ్యయం 55 వేల 548 కోట్లని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. 2014 ధరల ప్రకారం అప్పటి ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం చెల్లింపులు చేస్తామని కేంద్రం వ్యాఖ్యానించిన నేపధ్యంలో పేచీ ప్రారంభమైంది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన రాష్ట్ర ప్రభుత్వం పలు దఫాలుగా కేంద్రంతో..సంబంధిత శాఖాధికార్లతో చర్చించి కేంద్ర ప్రభుత్వ ( Central government ) సందేహాల్ని నివృత్తి చేసింది. ప్రాజెక్టు వ్యయంపై పూర్తి నివేదికను సమర్పించింది. 

Also read: AP: రాష్ట్రంలో ఇళ్ల పట్టాల పంపిణీ ప్రారంభం

సవరించిన అంచనా వ్యయాన్ని ఆమోదించమంటూ అటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ( Central home minister amit shah ), ఇటు జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ శెఖావత్‌ను కలుసుకుని డీపీఆర్ - 2 ( DPR 2 ) ను ఆమోదించమని రాష్ట్రమంత్రులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) కోరారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. చివరికి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో సంవత్సర సమీక్షలో పోలవరం ప్రాజెక్టు ఆమోదించిన వ్యయం 55 వేల 548 కోట్లని అధికారికంగా ప్రకటించింది.  పోలవరం ప్రాజెక్టు వ్యయ ఆమోదంపై నెలకొన్న సందిగ్దతకు కేంద్రం తెర దించిందనడానికి ఇదే నిదర్శనం. 

పోలవరం ప్రాజెక్టు ( Polavaram project ) కోసం ఇప్పటివరకూ 8 వేల 614 కోట్లు విడుదల చేయగా..మరో 2 వేల 234 కోట్ల రూపాయల్ని త్వరలో విడుదల చేయనున్నామని తెలిపింది. ఇప్పుడు సవరించిన వ్యయాన్ని కేంద్రం అధికారికంగా ప్రకటించడంతో పోలవరం ప్రాజెక్టు ప్రధాన సమస్య తీరినట్టే. ఇక అనుకున్న సమయానికి ప్రాజెక్టు ప్రారంభించేందుకు మార్గం సుగమమైనట్టే.

Also read: AP: చంద్రబాబుపై విమర్శలు సంధించిన టీడీపీ ఎమ్మెల్యే

Trending News