Vijayawada Fire accident: మృతుల కుటుంబాలకు కేంద్రం ఆర్ధిక సహాయం

విజయవాడలో జరిగిన కోవిడ్ సెంటర్ అగ్నిప్రమాదంపై కేంద్రం స్పందించింది. మృతి చెందిన కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. పీఎంఎస్ఆర్ఎఫ్ నుంచి నిధుల్ని విడుదల చేసింది.

Last Updated : Aug 9, 2020, 11:23 PM IST
Vijayawada Fire accident: మృతుల కుటుంబాలకు కేంద్రం ఆర్ధిక సహాయం

విజయవాడలో జరిగిన కోవిడ్ సెంటర్ అగ్నిప్రమాదంపై కేంద్రం స్పందించింది. మృతి చెందిన కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. పీఎంఎస్ఆర్ఎఫ్ నుంచి నిధుల్ని విడుదల చేసింది.

ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని కోవిడ్ సెంటర్లో జరిగిన అగ్నిప్రమాదంపై కేంద్ర ప్రభుత్వం హుటాహుటిన స్పందించింది. సంఘటన జరిగిన కాస్సేపటికి ప్రధాని మోదీ..ఏపీ సీఎం జగన్ కు  ఫోన్ చేసి ఆరా తీశారు. తరువాత తనవంతుగా ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. అగ్నిప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50 వేల రూపాయలు పరిహారం ప్రకటించింది. ఈ మేరకు పీఎంఎస్ఆర్ఎఫ్ నుంచి నిధుల్ని కూడా విడుదల చేసింది. ఇప్పటికే సీఎం వైఎస్ జగన్ మృతుల కుటుంబాలకు 50 లక్షల రూపాయలు ప్రకటించిన విషయం తెలిసిందే.

స్వర్ణప్యాలేస్ హోటల్ ను విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యం లీజుకు తీసుకుని కోవిడ్ సెంటర్ గా మార్చింది. ఈ హోటల్ లో జరిగిన అగ్నిప్రమాదంలో 11 మంది మరణించారు. ఈ సంఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేయడమే కాకుండా...విచారణ కమిటీను ఏర్పాటు చేసింది. 48 గంటల్లోగా ఆ కమిటీ నివేదిక సమర్పించాలని కోరింది. Also read: AP: రికార్డు స్థాయిలో 25 లక్షల పరీక్షలు

Trending News