ఏపీకి చెందిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పోలవరానికి మళ్లీ బ్రేకులు పడే పరిస్థితులు కల్పిస్తున్నాయి. పోలవరం నిర్మాణంపై ఏపీ సర్కార్ కు కేంద్రం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పర్యవరణ నింబంధనలను ప్రస్తావిస్తూ దానిపై వివరణ కోరింది. ఈ ప్రాజెక్టు విషయంలో పర్యావరణ అనుమతులు ఎందుకు రద్దు చేయకూడదో ఏపీ సర్కార్ కు వివరణ ఇవ్వాలని పేర్కొంది. పురుషోత్తపట్నం ప్రాజెక్టుపై కూడా కేంద్రం వివరణ కోరింది.
ప్రముఖ మీడియా కథనం ప్రకారం పోలవరంతో పాటు దాని అనుబంధ ప్రాజెక్టులపై తనిఖీలు జరిపించిన పర్యవారణశాఖ అధికారులు.. ప్రాజక్టు నిర్మాణ ప్రక్రియలో పర్యావరణ అనుమతుల నిబంధనల్లో ఉల్లంఘనలు జరిగాయని తేల్చారు. ఇలా తనిఖీల తర్వాత కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు అధికారులు సమగ్ర నివేదిక అందజేశారు. ఈ రిపోర్టును ఆధారంగా గత జులై నెలలో జాతీయ హరిత ట్రైబ్యునల్‌లో అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ సర్కార్ కు నోటీసులు నోటీసులు జారీ అయ్యాయి. ఈ ప్రాజెక్టు విషయంలో పర్యావరణ అనుమతులు ఎందుకు రద్దు చేయకూడో వివరణ ఇవ్వాలని పేర్కొంది.
పోలవరానికి ఇటీవలే స్టాప్ వర్క్ ఆర్డర్‌ను రెండేళ్ల పాటు పొడిగించిన కేంద్రం.. మళ్లీ అనూహ్యంగా షోకాజ్ నోటీసులు జారీచేసింది. తాజా పరిణామంలో ఏపీ సర్కార్ కు ఏమాత్రం మింగుపడటం లేదు. అయితే దీనిపై ఏపీ సర్కార్ వివరణను బట్టి ఈ ప్రాజెక్టు భవితవ్యం ఆధారపడింది..