విశాఖపట్టణంలో 'యానిమేషన్ అండ్ గేమింగ్ సిటీ' ఏర్పాటు

సోమవారం రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో అనేక అంశాలను ఆమోదించారు.

Last Updated : Apr 17, 2018, 05:31 PM IST
విశాఖపట్టణంలో 'యానిమేషన్ అండ్ గేమింగ్ సిటీ' ఏర్పాటు

అమరావతి: సోమవారం రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో అనేక అంశాలను ఆమోదించారు. ఇందులో పలు కీలకమైన అంశాలు కూడా ఉన్నాయి. మంత్రి మండలి సమావేశంలో ఆమోదించిన అంశాలను రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు విలేకరులకు వెల్లడించారు.  

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం పొందిన అంశాలు:

*  ఆక్వా పాలసీ, ప్రజా ప్రతినిధులపై నమోదైన క్రిమినల్‌ కేసులను విచారించేందుకు విజయవాడలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు.

*  పట్టణాల్లో పీఎంఏవై కింద నిర్మించే ఇళ్లకు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు.

*  యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్స్ పాలసీకి ఆమోదం. 2020 నాటికి రూ.6400కోట్ల పెట్టుబడి ఆకర్షించేలా పాలసీ రూపకల్పన. విశాఖలో 40 ఎకరాల్లో యానిమేషన్ అండ్ గేమింగ్ సిటీ ఏర్పాటు

*  చంద్రన్న పెళ్లికానుక పథకాన్ని ఈనెల 20 నుంచి ప్రారంభం. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న యువతుల పెళ్లికి ప్రభుత్వ నజరానా రూ.40 వేలు.

*  సాగునీటి ప్రాజెక్ట్ గా తెలుగుగంగ,  ఖాళీగా ఉన్న పలు ప్రభుత్వ పోస్టులను భర్తీకి గ్రీన్ సిగ్నల్. విశాఖ జిల్లాలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు. 

*  భోగాపురం విమానాశ్రయం నిర్మాణం కోసం ఎపిఎఇసిఎల్‌కు అప్పగింత.

మంత్రివర్గ సమావేశానికి ముందు, సోమవారం తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర బంద్, ఈ నెల 20న సీఎం చేపట్టనున్న ఒక రోజు దీక్ష తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈనెల 20వ తేదీన చేపట్టనున్న దీక్షల పర్యవేక్షణకు ఐదుగురు మంత్రులతో కమిటీ ఏర్పాటు చేశారు. సీఎం దీక్షతో పాటు 175 నియోజకవర్గాల్లో జరిగే దీక్షల పర్యవేక్షణకు కమిటీని నియమించారు. కమిటీలో సభ్యులుగా కళా వెంకట్రావు, నారా లోకేష్, దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, నక్కా ఆనందబాబులు నియమించారు.

Trending News