బ్రేకింగ్ న్యూస్: జగపతిబాబు పొలిటికల్ ఎంట్రీ !

Last Updated : Nov 20, 2017, 03:43 PM IST
    1. వైజాగ్ బీచ్ వద్ద డిఫరెంట్ స్టైల్ లో జగపతి బాబు
    2. పంచకట్టెతో జగ్గు భాయ్ హల్ చల్
    3. కొత్త గెటప్ పై మీడియా ప్రశ్నలు
    4. రెండో రోజుల్లో చెబుతానని జగపతిబాబు రిప్లై
    5. జగ్గుబాయ్ పొలిటికల్ ఎంట్రీపై బలంగా ఊహాగానాలు
    6. ఆయన ఏ పార్టీలో చేరుతారనేది మరో సస్పెన్స్
    7. టీడీపీలో చేరతారని చెబుతున్న అభిమానులు
బ్రేకింగ్ న్యూస్: జగపతిబాబు పొలిటికల్ ఎంట్రీ !

ఇటీవలికాలంలో సినీ నటులు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం సర్వసాధారణంగా మారింది. ఈ క్రమంలో నటుడు జగపతిపతిబాబు కూడా పొలిటికల్ ఎంట్రీ ఇస్తారని బలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సోమవారం జగపతి బాబు తన స్టైల్ కు భిన్నంగా వైజాగ్ బీచ్ వద్ద పంచకట్టెతో హల్ చల్ చేశారు. ఈ సందర్భంగా విలేఖరులు తన కొత్త గెటప్ పై ప్రశలు సంధించగా ..ఈ గెటప్ గురించి రెండు రోజుల్లో సమాధానం చెబుతానని ఆయన సమాధానమిచ్చారు. అయితే అతని అభిమానులు మాత్రం ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇస్తారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తన కొత్త గెటప్ పై మాట్లాడుతూ రెండు రోజుల్లో చెబుతాననడం.పొలిటికల్ ఎంట్రీగురించేనని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో జగపతి బాబు పొలిటికల్ ఎంట్రీపై ఉత్కంఠత నెలకొంది.. ఇదిలా ఉండగా ఆయన ఏ పార్టీ చేరుతారని విషయంపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఆయన టీడీపీలో చేరే అవకాశాలున్నాయని ఆయన అభిమానులు చెప్పుకొస్తున్నాయి. 

 

Trending News