కరోనా వైరస్ ( Corona Virus ) సంక్రమణ నేపధ్యంలో మరోసారి లాక్‌డౌన్ ( Lockdown ) దిశగా ఏపీ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. గత నాలుగైదు రోజులుగా 3-4 వేల కేసులు వెలుగుచూస్తుండటంతో అందరిలో ఆందోళన పెరిగింది. ఇంకోసారి లాక్‌డౌన్ ప్రకటిస్తే మంచిదనే అంశంపై సమాలోచన చేస్తోంది వైఎస్ జగన్ ప్రభుత్వం ( Ys jagan Government ).
ఏపీలో రోజురోజుకూ కోవిడ్ కేసులు ( Covid cases ) పెరుగుతున్నాయి. ప్రతిరోజూ 3 నుంచి 4 వేల కేసులు బయటపడుతున్నాయి. ఓ వైపు పెద్దఎత్తున టెస్టులు చేస్తూ ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటున్నా సరే..వైరస్ కట్టడి కావడం లేదు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో స్వచ్ఛంధ లాక్‌డౌన్ ప్రకటించారు. గుంటూరు, చిత్తూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో వ్యాపారులు స్వచ్ఛంధంగా దుకాణాలు మూసివేసి లాక్‌డౌన్ పాటించారు. ఇప్పటికే రాష్ట్రంలో కోవిడ్ టెస్టుల ( Covid Tests ) సంఖ్య 13 లక్షల 50 వేలు దాటేసింది. అటు పాజిటివ్ కేసులు 45 వేలు దాటాయి. ఈ నేపధ్యంలో ఏపీలో మరోసారి కనీసం రెండువారాల పాటు లాక్‌డౌన్ పాటించడం మంచిదనేది ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ( Ap Health Department ) ఆలోచనగా ఉంది. ఈ ప్రతిపాదనను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) ముందుంచారు. జగన్ ప్రభుత్వం ఇప్పుడు దీనిపై సమాలోచన చేస్తోంది. పెరుగుతున్న కేసుల్ని సమర్ధవంతంగా ఎదుర్కోగలుగుతున్నప్పుడు లాక్‌డౌన్ ( Lockdown ) అవసరం ఏముందనేది మరో వాదనగా ఉంది. పెద్ద ఎత్తున పరీక్షలు చేయడంతో పాటు ప్రైవేట్ ఆసుపత్రుల్ని సైతం ఆధీనంలో తీసుకుని చికిత్స అందిస్తున్న విషయాన్ని కొంతమంది గుర్తు చేస్తున్నారు. Also read: AP: సెప్టెంబర్ నుంచి స్కూల్స్ ప్రారంభం?
లాక్‌డౌన్ విధించకుండా కంటెయిన్మెంట్ జోన్ల సంఖ్యను పెంచితే మంచిదనే మరో అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. లాక్‌డౌన్ తో మరోసారి సామాన్యుల్ని ఇబ్బంది పెట్టడం మంచిది కాదనే వాదన కొందరిలో ఉంది. మరి జగన్ ప్రభుత్వం ( Jagan Government ) లాక్‌డౌన్ పై ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. Also read: AP Districts: ఉగాది నాటికి కొత్త జిల్లాలు ప్రారంభం
ఏపీలో మరోసారి లాక్‌డౌన్ విధించనున్నారా?