నిరుద్యోగ భృతి: నిరుద్యోగులకు గుడ్ న్యూస్

అక్టోబర్ 2న ముఖ్యమంత్రి యువనేస్తం పథకం ప్రారంభం

Last Updated : Sep 30, 2018, 09:23 PM IST
నిరుద్యోగ భృతి: నిరుద్యోగులకు గుడ్ న్యూస్

ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఇటీవల ప్రకటించిన ముఖ్యమంత్రి యువనేస్తం పథకంపై తాజాగా మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. నిరుద్యోగ భృతికి దరఖాస్తు చేసుకోవడానికి నిర్ధిష్టమైన గడువు ఏమీ లేదని, ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ అని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ప్రతి నెలా ప్రభుత్వానికి అందిన దరఖాస్తులను నెలాఖర్లో 25వ తేదీలోగా పరిశీలించి అర్హులైన అభ్యర్థుల జాబితా రూపొందించాల్సిందిగా మంత్రి అధికారులకు ఆదేశాలు జారీచేశారు. పథకం ప్రారంభించిన కొద్దిరోజుల్లోనే 2 లక్షల మంది నిరుద్యోగ భృతికి అర్హులుగా నిలిచినట్లు మంత్రి స్పష్టం చేశారు. అక్టోబర్ 2న ఉండవల్లి ప్రజావేదికలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నప్పటికీ.. ఆరోజున మహాత్మా గాంధీ జయంతి కారణంగా సెలవుదినం కావడంతో.. అక్టోబర్2న కాకుండా అక్టోబర్3న నిరుద్యోగుల ఖాతాల్లో రూ.1000 జమ చేస్తామని మంత్రి లోకేశ్ వివరించారు.

సుమారు 5 లక్షల మంది అభ్యర్థులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోగా అందులోంచి 2 లక్షల మందిని అర్హులుగా ఎంపిక చేసినట్టు సమాచారం.

Trending News