మే 4న ఏపీ టెట్ నోటిఫికేషన్: జూన్ 10 నుండి పరీక్షలు

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) నోటిఫికేషన్‌‌ను మే 4వ తేదిన విడుదల చేయనున్నట్లు ఏపీ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు  ఓ ప్రకటనలో తెలిపారు. 

Last Updated : Apr 23, 2018, 09:47 PM IST
మే 4న ఏపీ టెట్ నోటిఫికేషన్: జూన్ 10 నుండి పరీక్షలు

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) నోటిఫికేషన్‌‌ను మే 4వ తేదిన విడుదల చేయనున్నట్లు ఏపీ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు  ఓ ప్రకటనలో తెలిపారు. అలాగే జూన్‌ 10వ తేది నుండి టెట్ పరీక్షలు మళ్లీ నిర్వహిస్తామని ఆయన తెలియజేశారు. అయితే ఈ సారి కూడా టెట్ పరీక్షలు ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తామని ఆయన అన్నారు. 

టెట్‌ పరీక్షలు నిర్వహించాక..  సాధ్యమైనంత త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్‌ కూడా ఇస్తామని మంత్రి గంటా ప్రకటించారు. అదేవిధంగా ఏప్రిల్ 29వ తేదిన పదో తరగతి పరీక్షల ఫలితాలు కూడా విడుదల చేస్తున్నట్లు తెలియజేశారు. ఇప్పటికే ఆగస్టు చివరి వారంలోకల్లా డీఎస్సీ నిర్వహించాలని అధికారులకు సమాచారం అందించిన్నట్లు.. అందుకు తగ్గ కార్యాచరణకు  ప్రణాళికలు వేస్తున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు.

గత సంవత్సరం డిసెంబరు నెలలో  టెట్ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష) నోటిఫికేషన్ విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ, పరీక్షలను ఈ ఏడాది జనవరి 17 నుంచి 27 వరకు నిర్వహిస్తామని ప్రకటించింది. అయితే సిలబస్‌లో మార్పులు చేయడంతో పాటు ఆన్‌లైన్ పరీక్షల మీద అంతగా అవగాహన లేకపోవడం.. చదువుకోవడానికి సమయం లేదని అభ్యర్థుల నుండి ఫిర్యాదులు వెల్లువెత్తడం లాంటి సమస్యల వల్ల అవే పరీక్షలను ఫిబ్రవరి 5 నుంచి నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది.

ముఖ్యంగా భాషా పండిట్‌లకు సంబంధించి కొత్తగా పేపర్-3 కూడా ఉంటుందని తెలపడంతో అభ్యర్థుల్లో అయోమయం నెలకొంది. ఈ క్రమంలో మళ్లీ టెట్‌ను వాయిదా వేయాల్సి వచ్చింది. దీంతో చివరిగా ఫిబ్రవరి 21 నుంచి మార్చి 3 వరకు తొలిసారిగా టెట్‌ను ఆన్‌లైన్‌లో నిర్వహించగా.. ఈ పరీక్షల నిర్వహణలో కూడా గందరగోళం నెలకొనడంతో పాటు పలు విమర్శలు వెల్లువెత్తడంతో మళ్లీ టెట్ నిర్వహించడానికి విద్యాశాఖ సంకల్పించింది

Trending News