ఏపీలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే విషయమై ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. ఈసారి ఎన్నికల్లో పోటీ విషయమై..జగన్‌కు మంత్రి ధర్మానకు ఏకాభిప్రాయం కుదరడం లేదు. ఆ వివరాలు మీ కోసం..
ఏపీలో 2024 ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా లేనంటూ రెవిన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు స్వయంగా చెప్పానని కూడా తెలిపారు. తాను విశ్రాంతి తీసుకోవల్సిన సమయం వచ్చేసిందని..అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పానన్నారు. అయితే జగన్ మాత్రం తన అభిప్రాయాన్ని తిరస్కరిస్తున్నారని..ఒప్పుకోవడం లేదని ధర్మాన స్పష్టం చేశారు. ఈ ఒక్క ఎన్నికల్లో పోటీ చేయాలని కోరుతున్నట్టు ధర్మాన ప్రసాదరావు తెలిపారు.
తాను పోటీ చేయకపోవడానికి మరో కారణం కూడా తెలిపారు. తనతో పాటు పనిచేసిన నేతలు ఎదగాలని కోరుకుంటున్నానన్నారు. వచ్చే తరానికి నాయకుల్ని తయారు చేసిన సమాజానికి అందించే విధంగా చిత్తశుద్ధితో పనిచేస్తానన్నారు. మరోవైపు తన స్థానంలో కుమారుడు రామ్ మనోహర్ నాయుడిని పోటీ చేయించేందుకు జగన్ అవకాశం ఇవ్వడం లేదనే ప్రచారం కూడా జరుగుతోంది.
రాష్ట్ర మంత్రివర్గంలో పలు కీలక నిర్ణయాల అమలులో వైఎస్ జగన్ ఎక్కువగా నమ్మేది ధర్మాన ప్రసాదరావునే. గతంలో న్యాయ వ్యవస్థ అధికారాలపై చర్చను కూడా ధర్మానతోనే నడిపించారు. మూడు రాజధానుల విషయంలో సబ్జెక్ట్ పరంగా మాట్లాడించింది కూడా ధర్మానతోనే. విభిన్న అంశాలపై మంత్రి ధర్మానకు ఉన్న పట్టు, అవగాహన అలాంటిది.
Also read: Ysrcp Rebel Mla: వైసీపీలో రెబెల్ ఎమ్మెల్యే, ఆనంపై సీఎం జగన్ ఆగ్రహం, వేటు పడనుందా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook