New Sand Policy: కొత్త ఇసుక పాలసీతో ప్రజలకు ప్రయోజనం

New Sand Policy: ఏపీ ప్రభుత్వం కొత్త ఇసుక పాలసీ ప్రవేశపెట్టింది. నూతన విధానం కచ్చితంగా ప్రజలకు ప్రయోజనం కల్గిస్తుందని పంచాయితీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 22, 2021, 09:22 PM IST
New Sand Policy: కొత్త ఇసుక పాలసీతో ప్రజలకు ప్రయోజనం

New Sand Policy: ఏపీ ప్రభుత్వం కొత్త ఇసుక పాలసీ ప్రవేశపెట్టింది. నూతన విధానం కచ్చితంగా ప్రజలకు ప్రయోజనం కల్గిస్తుందని పంచాయితీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. 

ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త ఇసుక విధానం(New Sand Policy)పై రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది(Gopalakrishna dwivedi) వివరణ ఇచ్చారు. పాలసీ విధి విధానాల్ని వివరించారు. ఇసుక టెండర్ల విషయంలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించారు. కొత్త పాలసీని ఎంతో పారదర్శకంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. మంత్రివర్గ ఉపసంఘం(Cabinet Sub committee) సిఫార్సులు, ప్రజల నుండి వచ్చిన ఫీడ్‌బ్యాక్ తీసుకుని పాలసీలో మార్పులు చేసి నూతన ఇసుక విధానాన్ని ప్రవేశ పెట్టామని అన్నారు.

ప్రభుత్వం నిర్ణయించిన ధరకే ఇసుక అమ్మకాలు జరుగుతున్నాయని, ప్రతీ నియోజకవర్గానికి ఒక ఇసుక రీచ్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అన్ని రీచ్‌లలో ఒకే ధర అమలు చేస్తున్నామని, ప్రతి ఇసుక రీచ్‌ వద్ద ఇరవై వాహనాలు ఏర్పాటు చేసిట్లు చెప్పారు. రాష్ట్రంలో ప్రతి రీచ్‌‌లో ధరను (Sand price) ముందే నిర్ణయిస్తున్నామని, ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ లేకుండా వినియోగదారులు నేరుగా వచ్చి వారి సొంత వాహనాల్లో ఇసుకను తీసుకెళ్లవచ్చని చెప్పారు. నాణ్యతను పరిశీలించి తమకు నచ్చినచోట ఇసుక తీసుకెళ్లే వెసులుబాటు కూడా ఉందన్నారు. 

ఇసుక తవ్వకాలు, అమ్మకాలను ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించడంపై వస్తున్న ఆరోపణలపై గోపాలకృష్ణ ద్వివేది (Gopalakrishna dwivedi)మాట్లాడారు. ఇసుక తవ్వకాలు, రీచ్ నిర్వహణ, అమ్మకాలకు సంబంధించి టెండర్‌లను ఆహ్వానించామని..వారం రోజులు అదనపు సమయం కూడా ఇచ్చామని చెప్పారు.  పూర్తి  పారదర్శకంగా టెండర్లను నిర్వహించి..జనవరి 4న ఎంఎస్టీసీ(MSTC)తో ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. ఇక సాంకేతిక, ఆర్థిక అర్హతలు అన్నీ ముందే పరిశీలించామన్నారు. ఏడాదికి వేయి కోట్ల ఇసుకను సరఫరా చేయగలదని చెప్పారు. ప్రతి 15 రోజులకు ప్రభుత్వానికి టెండర్ సంస్థ డబ్బులు చెల్లించాలన్నారు. 70 శాతం రీచ్‌లు ఖచ్చితంగా నిరంతరం అందుబాటులో ఉండాలని సూచించారు. ఇసుక కొరత (Sand Scarcity)సృష్టించడానికి వీలు లేకుండా నిబంధనలు రూపొందించామని..ప్రభుత్వాన్ని మోసం చేయలేరని చెప్పారు. ప్రతి రీచ్ దగ్గర టన్ను ఇసుక 475 రూపాయల్ని  ఖరారు చేశామన్నారు.

Also read: Ysrcp walkout: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వాకౌట్ చేసిన వైసీపీ ఎంపీలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News