హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రెస్ అకాడమి విజయవాడకు తరలిపోనుంది. ప్రస్తుతం ఆ కార్యాలయాన్ని విజయవాడలోని మొగల్రాజపురంలోని రెవెన్యూ కాలనీలో ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కొత్త కార్యాలయాన్ని ఈ నెల 10వ తేదీన రాష్ట్ర పౌర సంబంధాల శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు అధికారికంగా ప్రారంభిస్తారని, అకాడమీ కార్యదర్శి డి. శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. 1996లో హైదరాబాద్‌లో ప్రారంభమైన ప్రెస్ అకాడమి నాంపల్లి కేంద్రంగా పనిచేస్తూ, వర్కింగ్ జర్నలిస్టుల వికాసం కోసం, వారికి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నిర్వహించడం కోసం పనిచేసేది. ప్రెస్ అకాడమి ఆధ్వర్యంలో పొత్తూరి వెంకటేశ్వరావు, ఇనగంటి వెంకట రావు లాంటి ప్రముఖ పాత్రికేయులెందరో పాత్రికేయ రంగానికి సంబంధించి పుస్తకాలను ప్రచురించి, సమకాలీన జర్నలిస్టులకు అవగాహన కలిగించే ప్రయత్నం చేశారు.
ఏపీ ప్రెస్ అకాడమీ విజయవాడకు తరలింపు