దేశవ్యాప్తంగా కలకలం రేపిన స్వర్ణప్యాలేస్ అగ్ని ప్రమాదం ( swarna palace ) పై డాక్టర్ రమేష్ ( Dr Ramesh ) పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే కోవిడ్ నిబంధనల కారణంగా ఆన్ లైన్ విచారణకు హాజరవుతానని సమాధానమివ్వడం చర్చనీయాంశమవుతోంది.
ఏపీ విజయవాడలో ( Vijayawada ) ప్యాలేస్ హోటల్ లో నడుస్తున్న కోవిడ్ సెంటర్ లో అగ్నిప్రమాదం జరిగి 11 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తు చేస్తోంది. కోవిడి సెంటర్లో నిబంధనల్ని పూర్తిగా ఉల్లంఘించినట్టు పోలీసులు గుర్తించారు. డాక్టర్ రమేష్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్టుగా నిర్ధారించారు. కేసు నమోదు చేశారు. అయితే పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్న డాక్టర్ రమేష్..హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. అనంతరం హైకోర్టు స్టేను ( High court stay ) సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. స్టేను రద్దు చేసిన సుప్రీంకోర్టు విచారణ కొనసాగించవచ్చని తెలిపింది.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణ తిరిగి ప్రారంభించిన ఏపీ పోలీసులు డాక్టర్ రమేష్ ను విచారణకు హాజరుకావల్సిందిగా సీఆర్పీసీ సెక్షన్ 160 కింద నోటీసులు జారీ చేశారు. అయితే కోవిడ్ సంక్రమణ, సుప్రీంకోర్టు తీర్పు నేపధ్యంలో తాను ఆన్ లైన్ విచారణకు హాజరవుతానని డాక్టర్ రమేష్ చెప్పడం చర్చనీయాంశమవుతోంది. డాక్టర్ రమేష్ సమాధానంపై ఏపీ పోలీసులు ఎలా స్పందిస్తారో చూడాలి మరి. Also read: AP: డీఎస్సీ 2018 ఎస్జీటీ అభ్యర్ధులకు శుభవార్త, నియామకాలు ప్రారంభం