AP: నేషనల్ హెల్త్ మిషన్ అమలులో ఏపీనే టాప్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో అరుదైన ఘనత సాధించింది. ఇప్పటికే పలు రకాల సంక్షేమ పథకాల అమలుతో టాప్‌లో ఉంది. ఇప్పుడు నేషనల్ హెల్త్ మిషన్ అమలులో అగ్రస్థానాన్ని సాధించింది.

Last Updated : Jan 11, 2021, 01:51 PM IST
AP: నేషనల్ హెల్త్ మిషన్ అమలులో ఏపీనే టాప్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో అరుదైన ఘనత సాధించింది. ఇప్పటికే పలు రకాల సంక్షేమ పథకాల అమలుతో టాప్‌లో ఉంది. ఇప్పుడు నేషనల్ హెల్త్ మిషన్ అమలులో అగ్రస్థానాన్ని సాధించింది. 

ఏపీ ప్రభుత్వం ( Ap Government ) లో ఇప్పటికే ఆరోగ్యశ్రీ, అమ్మఒడి ( Ammavodi ), విద్యా దీవెన, వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ చేయూత, ఆసరా వంటి సంక్షేమ పథకాలు దిగ్విజయంగా అమలవుతున్నాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ( Central Government ) పథకమైన నేషనల్ హెల్త్ మిషన్ అమలులో ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. మిగిలిన రాష్ట్రాల్ని వెనక్కి నెట్టి టాప్‌లో నిలిచింది. ఏడాదిన్నర కాలంలోనే కొన్ని పథకాల అమలులో మిగిలిన రాష్ట్రాల కంటే ముందంజలో ఉన్నట్టు జాతీయ ఆరోగ్య మిషన్ నిర్వహించిన సర్వేలో తేలింది. గతంలో గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలో పోటీ పడిన ఏపీ..ఇప్పుడు గుజరాత్ ( Gujarat ) ‌ను కూడా వెనక్కి నెట్టి..అగ్రస్థానాన్ని ఆక్రమించింది.  

నేషనల్ హెల్త్ మిషన్‌ ( National Health Mission )లో ముఖ్యమైన నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ విషయంలో తీసుకున్న చర్యలకు గానూ ఏపీ ( Ap ) నెంబర్ వన్‌గా నిలిచింది. క్యాన్సర్, గుండె జబ్బులు, షుగర్ వంటి వ్యాధుల్ని గుర్తించేందుకు 5 కోట్ల జనాభాకు ఇంటింటి సర్వే నిర్వహించింది ఏపీ ప్రభుత్వం.  

రాష్ట్రంలో హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్లు అంటే వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ నిర్వహణలో ప్రధమ స్థానంలో నిలిచింది. 104 అంబులెన్స్ ద్వారా ప్రతి ఊరికి ప్రాధమిక వైద్యం, మందులు ఉచితంగా అందిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో పదివేలకు పైగా హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్లు ఉండగా..కొత్తగా 8 వేల 604 భవనాల్ని నిర్మిస్తున్నారు. ఈ కేంద్రాల్లో ప్రధానంగా 12 రకాల వైద్య సేవల్ని అందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.

Also read: Amma Vodi scheme: అమ్మ ఒడి పథకం రేపే..ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా ప్రారంభం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News