AP Panchayat Elections: వైఎస్ జగన్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్.. ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్

AP Panchayat Elections: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల నిర్వహణ అంశంపై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ఏపీ సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఎన్నికల నిర్వహణకు అనుమతి ఇస్తూనే ప్రజల ఆరోగ్యం పట్టించుకోవాలని సూచించింది.

Written by - Shankar Dukanam | Last Updated : Jan 21, 2021, 11:56 AM IST
  • ఏపీలో పంచాయితీ ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
  • సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును కొట్టేసిన రాష్ట్ర సర్వోన్నత ధర్మాసనం
  • ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోవాలని ఆదేశాలలో పేర్కొన్న ఏపీ హైకోర్టు
AP Panchayat Elections: వైఎస్ జగన్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్.. ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్

AP Panchayat Elections: AP High Court Verdict On Panchayat Elections: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల నిర్వహణ అంశంపై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ఏపీ సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఎన్నికలు ముఖ్యమైన విషయం అయినప్పటికీ ప్రజల ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోవాలని హైకోర్టు సూచించింది. హైకోర్టు తీర్పుతో ఏపీ ప్రభుత్వానికి షాక్ తగిలింది.

ఏపీలో స్థానిక ఎన్నికలు వాయిదా వేయాలని, ప్రస్తుతం ఎలక్షన్ జరపకూడదని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) ప్రభుత్వం భావించింది. ఈ మేరకు ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇచ్చిన పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఇటీవల ఈ పిటిషన్ విచారించిన సింగిల్ జడ్జి ఎన్నికల నిర్వహణపై స్టే ఇవ్వడం తెలిసిందే. ఎన్నికల ప్రక్రియను నిలిపివేయాలని ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు.

Also Read: Extra Data Offer: ఈ ప్లాన్స్‌తో 5 GB ఎక్స్‌ట్రా డేటా మీ సొంతం

అయితే ఎన్నికల ప్రక్రియను నిలిపివేయాలని సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై ఏపీ ఎలక్షన్ కమిషన్ హైకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. ఈ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు సీజే జస్టిస్‌ ఏకే గోస్వామి, జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ వాదనలు పరిశీలించిన ధర్మాసనం పంచాయతీ ఎన్నికల(AP Local Body Elections) నిర్వహణ చేపట్టాలని గురువారం నాడు తమ తీర్పు వెలువరించింది. 

Also Read: Arup Kumar Goswami: ఏపీ సీజేగా జస్టిస్‌ అరూప్ గోస్వామి ప్రమాణం

కాగా, ఏపీ ఎలక్షన్ కమిషన్ జనవరి 8న పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ప్రకటించింది. నాలుగు దశలలో జరగనున్న స్థానిక ఎన్నికల నోటిఫికేషన్లు జనవరి 23 నుంచి విడుదల కానున్నాయి. ఎన్నికల నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేయగా.. ఎస్ఈసీ ఆదేశాలను సింగిల్ జడ్జి జనవరి 11న  కొట్టివేశారు. 

Also Read: COVID-19 Vaccine: కరోనా టీకా తీసుకున్నా.. వీరికి అంతగా పనిచేయదు! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News