AP MLC Elections: ఏపీలో మార్చ్ 13 న 9 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.ఇందులో నాలుగు స్థానిక సంస్థలు, రెండు ఉపాధ్యాయ, మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు. నాలుగు ఎమ్మెల్సీ స్థానాల్ని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మిగిలిన స్థానాల కౌంటింగ్ ఇంకా జరుగుతోంది.
ఏపీలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం దిశగా దూసుకుపోతోంది. ఇప్పటికే నాలుగు ఎమ్మెల్సీ స్థానాల్ని గెల్చుకుంది. మరో 5 స్థానాల కౌంచింగు జరుగుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి కవురు శ్రీనివాస్ సమీప టీడీపీ అభ్యర్ధి వంకా రవీంద్రనాథ్‌పై విజయం సాధించారు. ఇక కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికలో వైసీపీ అభ్యర్ధి డాక్టర్ మధుసూదన్ రావు గెలుపొందారు. శ్రీకాకుళం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాన్ని ఎన్ రామారావు కైసవం చేసుకున్నారు. ఏలూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సైతం వైసీపీ అభ్యర్ధి కైవసం చేసుకున్నారు.
ప్రస్తుతం శ్రీకాకుళం-విజయనగరం-విశాఖ పట్టభద్రుల స్థానం, ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు పట్టభద్రుల స్థానాల కౌంటింగ్ కొనసాగుతోంది. ఇక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు, కడప-అనంతపురం-కర్నూలు స్థానాల కౌంటింగ్ ఇంకా జరుగుతోంది. కౌంటింగ్ సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. టీచర్ల ఎమ్మెల్సీ స్థానాల ఫలితాలు ఇవాళ రాత్రికి, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఫలితాలు రేపు రాత్రి వరకూ రావచ్చని అంచనా. మరోవైపు ఎన్నికల కౌంటింగ్ నిలిపివేయాలని కోరుతూ దాఖలైన పిటీషన్‌పై ఏపీ హైకోర్టు స్పందించింది. ఉత్తరాంద్ర పట్టభద్రుల స్థానం ఎన్నిక కౌంటింగ్ నిలిపివేసేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది.
Also read: Heavy Rains Alert: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook
AP MLC Elections: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం