Ap: త్వరలో పోలవరం ప్రాజెక్టు ప్రారంభం

Polavaram project: ఆంధ్రప్రదేశ్ జీవనరేఖ ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టు త్వరలో ప్రారంభం కానుందా..అవును. ఏపీ మంత్రి ఇదే విషయమై సూచనలిచ్చారు. 2021కు ఎట్టి పరిస్థితుల్లోనూ పోలవరం పూర్తి చేస్తామన్నారు.

Last Updated : Dec 2, 2020, 01:24 PM IST
Ap: త్వరలో పోలవరం ప్రాజెక్టు ప్రారంభం

Polavaram project: ఆంధ్రప్రదేశ్ జీవనరేఖ ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టు త్వరలో ప్రారంభం కానుందా..అవును. ఏపీ మంత్రి ఇదే విషయమై సూచనలిచ్చారు. 2021కు ఎట్టి పరిస్థితుల్లోనూ పోలవరం పూర్తి చేస్తామన్నారు.

పోలవరం ప్రాజెక్టు ( Polavaram project )పై ఏపీ ఇరిగేషన్ మంత్రి మరోసారి స్పష్టత ఇచ్చారు. అసెంబ్లీ ( Assembly ) సాక్షిగా పోలవరం ప్రాజెక్టుపై నెలకొన్న సందేహాలకు నివృత్తి చేసే ప్రయత్నం చేశారు. ఐదు రోజుల పాటు జరగనున్న అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో మూడోరోజు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ( Minister Anil kumar yadav ) మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ 2021 నాటికి పూర్తి చేస్తామని...ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నారంటూ చేస్తున్న తప్పుడు ప్రచారంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

చంద్రబాబు ( Chandrababu naidu ) ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడూ ప్రాజెక్టును పట్టించుకోలేదని..ప్రతి సోమవారం పోలవరం అంటూ డ్రామాలతోనే సరి పెట్టారన్నారు. పోలవరం ఎత్తు విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని..ఒక్క అంగుళం కూడా తగ్గించమని చెప్పారు. మరోవైపు 70 శాతం పనులు పూర్తయ్యాయంటూ చంద్రబాబు చెప్పడం మంత్రి అనిల్ కుమార్ విమర్శించారు. 

జాతీయ హోదా ఉన్న ప్రాజెక్టును తామే నిర్మిస్తామని చెప్పడం కేవలం ప్యాకేజీల కోసమేనన్నారు. పోలవరం అంచనాను సమర్పించాలని కేంద్రం చెప్పినా..గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. Also read: AP: అసెంబ్లీలో కీలకమైన 11 బిల్లులు..కరెంటు బిల్లులో ఏముంది ?

Trending News