Ap Corona Update: 3 లక్షలకు చేరువలో కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు 3 లక్షలకు చేరువలో ఉన్నాయి. ఇప్పటివరకూ రాష్ట్రంలో 2 లక్షల 81 వేల 817 కేసులు నమోదయ్యాయి.  అటు కరోనా నిర్ధారణ పరీక్షలు కూడా రాష్ట్రంలో భారీగా చేస్తున్నారు. మరో 2-3 రోజుల్లో ఏపీలో కోవిడ్ 19 పరీక్షల సంఖ్య రికార్డు స్థాయిలో 30 లక్షలకు చేరువ కానుంది. 

Last Updated : Aug 15, 2020, 07:12 PM IST
Ap Corona Update: 3 లక్షలకు చేరువలో కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు 3 లక్షలకు చేరువలో ఉన్నాయి. ఇప్పటివరకూ రాష్ట్రంలో 2 లక్షల 81 వేల 817 కరోనా కేసులు నమోదయ్యాయి.  అటు కరోనా నిర్ధారణ పరీక్షలు కూడా రాష్ట్రంలో భారీగా చేస్తున్నారు. ఇప్పటివరకూ ఏపీలో 28 లక్షల 12 వేల 197 మందికి కోవిడ్ 19 పరీక్షలు చేశారు. గత 24 గంటల్లో రాష్ట్రంలో 53 వేల 712 పరీక్షలు నిర్వహించగా.. 8 వేల 732 మందికి పాజిటివ్ గా తేలింది. ఇప్పటివరకూ రాష్ట్రంలో 1 లక్షా 91 వేల 117 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా...88 వేల 138 యాక్టివ్ కేసులున్నాయి. గత 24 గంటల్లోనే 10 వేల 414 మంది డిశ్చార్చ్ అయ్యారు. ఏపీలో ఇప్పటివరకూ కరోనా వైరస్ కారణంగా మృతి చెందినవారి సంఖ్య 2 వేల 562కు చేరుకుంది. 

గత 24 గంటల్లో తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 1126 కేసులు వెలుగుచూడగా..చిత్తూరు జిల్లాలో 956 కేసులు నమోదయ్యాయి. విశాఖపట్నంలో 851 కేసులు నమోదయ్యాయి. Also read:Heavy Rain Alert: మరో మూడ్రోజులు ఏపీలో భారీ వర్షాలు

Trending News