APSRTC buses | అమరావతి: ఏపీఎస్ఆర్టీసీ బస్సులను మీ రాష్ట్రాల్లోకి అనుమతించాల్సిందిగా కోరుతూ పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాలకు ఏపీ సర్కార్ ( AP govt) తరపున రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఓ లేఖ రాశారు. వలసకూలీల రాకపోకలు మరింత సులభతరం చేసేందుకు జూన్ 8వ తేదీ నుంచి అంతరాష్ట్ర బస్సు సర్వీసులను పునరుద్ధరించాలని భావిస్తున్నామని.. అందుకు మీరు కూడా సహకరించాలని ఆ మూడు రాష్ట్ర ప్రభుత్వాలకు ఏపీ సర్కార్ ఓ విజ్ఞప్తి చేసింది. తమిళనాడులో ఇప్పటికే కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఆ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయలేదని సమాచారం. ( TTD rules post lockdown: లాక్డౌన్ తర్వాత టిటిడి భక్తులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు )
ఇక తెలంగాణ సర్కార్ ( Telangana govt) విషయానికొస్తే.. ఇప్పటికే రోడ్డు, రైలు మార్గాల ద్వారా వచ్చే బయటి రాష్ట్రాల వారిని కూడా రాష్ట్రంలోకి అనుమతిస్తున్నప్పటికీ.. ఆర్టీసీ బస్సులకు మాత్రం ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అయితే, జూన్ 8 నుంచి కేంద్రం వైపు నుంచి సైతం లాక్డౌన్ విషయంలో పలు సడలింపులు రానున్న నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కూడా ఏపీ సర్కార్ రాసిన లేఖకు సానుకూలంగా స్పందించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అదే కానీ జరిగితే అదే సమయంలో టిఎస్ఆర్టీసీ ( TSRTC) బస్సులు కూడా అంతర్రాష్ట్ర సర్వీసులు ప్రారంభించే అవకాశం ఉంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..