AP Movie Tickets Issue: సినిమా టికెట్ల ధరల పరిశీలనకు కొత్త కమిటీ..ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

Andhra Pradesh: సినిమా టికెట్ల ధరల పరిశీలనకు ఏపీ ప్రభుత్వం కొత్త కమిటీని నియమించింది.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 28, 2021, 12:57 PM IST
  • ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
  • సినిమా టికెట్ల ధరల పరిశీలనకు కొత్త కమిటీ
  • ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
AP Movie Tickets Issue: సినిమా టికెట్ల ధరల పరిశీలనకు కొత్త కమిటీ..ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

New Committee on MovieTickets: సినిమా టికెట్ల అంశంపై ఏపీ ప్రభుత్వం (AP Govt) కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ల ధరల పరిశీలనకు కొత్త కమిటీని (New Committee on MovieTickets) నియమించింది. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీకి హోంశాఖ ముఖ్యకార్యదర్శి విశ్వజిత్‌ ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు.

ఈ కమిటీలో సభ్యులుగా రెవెన్యూ, ఆర్థిక, పురపాలక ముఖ్యకార్యదర్శులు, సమాచార శాఖ కమిషనర్‌, న్యాయశాఖ కార్యదర్శి, కృష్ణా జిల్లా జేసీతో పాటు థియేటర్ల యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు, సినీ గోయర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు ఉంటారు. సినిమా థియేటర్ల వర్గీకరణతో పాటు టికెట్ల ధరలను ఈ కమిటీ నిర్ధారించనుంది. అనంతరం ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. 

Also Read: AP Movie Ticket Issue: ఏపీలో సినిమా టికెట్ ధరల తగ్గింపుపై హీరో నాని సంచలన వ్యాఖ్యలు

‘‘ప్రేక్షకులను, సినిమా ఇండస్ట్రీని బ్యాలెన్స్‌ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఇలాంటి అంశాలపై చర్చించేందుకు ఏపీ ప్రభుత్వం ఓ కమిటీ ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకోవడం శుభ పరిణామం’’అని నిర్మాత ‘దిల్‌’ రాజు (Dil Raju) అన్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News