Covid19 Update: ఏపీలో పెరుగుతున్న కరోనా వైరస్ కొత్త కేసులు, పరీక్షలు ముమ్మరం చేసిన ప్రభుత్వం

Covid19 Update: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నట్టే..ఆంధ్రప్రదేశ్‌లో సైతం కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మరోవైపు ఏపీలో కరోనా నిర్ధారణ పరీక్షల్ని మరోసారి ముమ్మరం చేస్తున్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 3, 2021, 09:27 PM IST
Covid19 Update: ఏపీలో పెరుగుతున్న కరోనా వైరస్ కొత్త కేసులు, పరీక్షలు ముమ్మరం చేసిన ప్రభుత్వం

Covid19 Update: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నట్టే..ఆంధ్రప్రదేశ్‌లో సైతం కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మరోవైపు ఏపీలో కరోనా నిర్ధారణ పరీక్షల్ని మరోసారి ముమ్మరం చేస్తున్నారు. 

దేశంలో కరోనా మహమ్మారి (Corona virus) మరోసారి పంజా విసురుతోంది. మహారాష్ట్ర, పంజాబ్, ఛత్తీస్‌గఢ్, కర్నాటక , ఢిల్లీ రాష్ట్రాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉండగా..మిగిలిన రాష్ట్రాల్లో సైతం  కేసులు నెమ్మదిగా పెరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కొత్త కేసులు క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. ఈ నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం (Ap government) అప్రమత్తమైంది. మరోసారి కరోనా నిర్ధారణ పరీక్షల్ని ముమ్మరం చేసింది. ఏపీలో గత 24 గంటల్లో 31 వేల 260 కరోనా పరీక్షలు (Covid tests) నిర్వహించగా..1398 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. ఇప్పటివరకూ రాష్ట్రంలో 9 లక్షల 5 వేల 946 మందికి కరోనా మహమ్మారి సోకింది.  ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బుల్లెటిన్ విడుదల చేసింది.

గత 24 గంటల్లో కరోనా వైరస్ నుంచి 787 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకూ 8 లక్షల 89 వేల 295 మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో అయితే కరోనా బారిన పడి గుంటూరులో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు, చిత్తూరు, వైఎస్సార్ కడప , కర్నూలు, ప్రకాశం, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 9 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ కరోనా వైరస్ కారణంగా 7 వేల 234 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 9 వేల 417 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 1 కోటి 51 లక్షల 77 వేల 364 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. 

Also read: Zilla parishad Elections: ఓటమి భయంతోనే చంద్రబాబు బహిష్కరణ డ్రామా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News