AP PRC Issue: ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పీఆర్సీ వివాదంపై ఉద్యోగ సంఘాలు పునరాలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. ప్రభుత్వంతో చర్చలకు సిద్ఘమయ్యే పరిస్థితి కన్పిస్తోంది.
ఏపీలో పీఆర్సీ వివాదం ఇంకా కొనసాగుతోంది. పీఆర్సీపై ప్రభుత్వం విడుదల చేసిన జీవోలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసిన ఉద్యోగ సంఘాలు ఇప్పుడు సమ్మెకు సిద్దమయ్యాయి. ఇప్పటికే సమ్మె నోటీసు ఇచ్చాయి. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులతో (Ap government)చర్చల కోసం ప్రభుత్వం మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్ సమీర్ శర్మలతో ఓ కమిటీ ఏర్పాటు చేసింది. ఉద్యోగ సంఘాలు మాత్రం పీఆర్సీ ఉత్తర్వులు రద్దు చేస్తేనే..చర్చలు జరుపుతామని స్పష్టం చేశాయి. అందుకే ఇరువురి మధ్య చర్చలు ఇంకా ప్రారంభం కాలేదు. మరోవైపు ఇదే అంశంపై హైకోర్టును ఆశ్రయించిన ఉద్యోగ సంఘాలకు చేదు అనుభవం ఎదురైంది. పూర్తి సమాచారం లేకుండా పిటీషన్లు ఎలా వేస్తారని హైకోర్టు ఉద్యోగ సంఘాలపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా..పీఆర్సీని (PRC Issue)సవాలు చేసే అధికారం ఉద్యోగులకు లేదని తేల్చి చెప్పింది.
ఇప్పుడు తిరిగి ప్రభుత్వంతో చర్చలు జరిపే విషయమై పునరాలోచనలో పడ్డాయి ఉద్యోగ సంఘాలు. ఇవాళ మద్యాహ్నం ప్రభుత్వం నియమించిన కమిటీతో చర్చలకు దిగే అవకాశాలున్నాయి. అయితే అధికారికంగా ఇంకా ప్రకటన చేయాల్సి ఉంది.
Also read: Zee Digital Tv: దక్షిణాది నాలుగు భాషల్లో ఘనంగా ప్రారంభమైన జీ డిజిటల్ టీవీ ప్రసారాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.