AP: మూడేళ్ల డిగ్రీ లేదిక..మళ్లీ తెరపైకి నాటి బ్రిటీషు కాలం నాటి ఆనర్స్ డిగ్రీ

ఏపీలో ఇక నూతన విద్యావిధానం అమల్లోకి రానుంది. ఇప్పటివరకూ చదివిని మూడేళ్ల డిగ్రీలు ఉండవు. మరోవైపు పాతకోర్సులన్నీ రద్దు కానున్నాయి. మరేం చదవాలి..

Last Updated : Dec 23, 2020, 08:22 AM IST
  • ఏపీలో ఇకపై మూడేళ్ల డిగ్రీ రద్దు..నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీలు
  • మూడేళ్ల ఎగ్జిట్ ఆప్షన్ సౌకర్యం
  • పది నెలల ఇంటర్న్ షిప్ తప్పనిసరి..ఈ విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి
AP: మూడేళ్ల డిగ్రీ లేదిక..మళ్లీ తెరపైకి నాటి బ్రిటీషు కాలం నాటి ఆనర్స్ డిగ్రీ

ఏపీలో ఇక నూతన విద్యావిధానం అమల్లోకి రానుంది. ఇప్పటివరకూ చదివిని మూడేళ్ల డిగ్రీలు ఉండవు. మరోవైపు పాతకోర్సులన్నీ రద్దు కానున్నాయి. మరేం చదవాలి..

జాతీయ నూతన విద్యావిధానం 2020 ( National Education Policy 2020 ) ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ( Ap Government ) సన్నద్ధమవుతోంది. ఏపీలో ఇకపై మూడేళ్ల డిగ్రీ కోర్సులు రద్దు కానున్నాయి. మూడేళ్ల డిగ్రీ స్థానంలో నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీ ప్రవేశపెడుతున్నారు. నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీ ( Honors Degree )కు మూడేళ్ల ఎగ్జిట్ ఆప్షన్ కూడా ఉంది. ఈ కోర్సులకు అదనంగా పది నెలల పాటు ఇంటర్న్‌షిప్ ( Internship ) తప్పనిసరి చేశారు. 2020-21 విద్యాసంవత్సరం నుంచి కొత్త విధానం అమల్లోకి వస్తుంది.

రాష్ట్రంలో డిగ్రీ చదివే విద్యార్ధుల్లో నైపుణ్యం పెంచేందుకు ఏడాది పాటు ఇంటర్న్‌షిప్ కలిగి నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీ ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) అధికారంలో వచ్చినప్పుడే అధికార్లను సూచించారు. దీనిపై ఉన్నత విద్యాశాఖ, ఉన్నత విద్యామండలి ప్రణాళిక రూపొందించి అనుమతి కోసం యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్‌కు పంపారు. యూజీసీ ( UGC ) సూచనల మేరకు  మూడేళ్ల డిగ్రీ కోర్సుల్ని కొనసాగిస్తూనే పదినెలల ఇంటర్న్‌షిప్ ఉండేలా ప్రణాళిక రచించారు. ఈలోగా జాతీయ విద్యావిధానం 2020లో మల్టిపుల్ ఎగ్జిట్ ఆప్షన్ ఉండేలా 3-4 ఏళ్ల కాల పరిమితితో డిగ్రీ కోర్సులు ప్రవేశపెట్టాలని ఉంది. Also read: New coronavirus strain: అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం, విదేశాల్నించి వచ్చేవారికి విధిగా ఆర్టీపీసీఆర్ పరీక్షలు

నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీ కోర్సులను ప్రవేశపెడుతూ..పది నెలల ఇంటర్న్‌షిప్  తప్పనిసరి చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయం ఇప్పటికే  తీసుకున్నారు. అయితే మూడేళ్ల తరువాత విద్యార్ధులకు ఎగ్జిట్ ఆప్షన్ కల్పించారు.  నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీ కోర్సుల్ని ప్రవేశపెడుతున్న నేపధ్యంలో ఇప్పటివరకూ అమల్లో ఉన్న మూడేళ్ల నాన్ ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సులన్నీ రద్దయ్యాయి. వీటి స్థానంలో మూడేళ్ల ఎగ్జిట్ ఆప్షన్‌ ( Three years Exit Option ) తో నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీ అమల్లో రానుంది. ఈ మేరకు సిలబస్ రివిజనైంది.

Also read: AP: పోలవరంపై నీతి ఆయోగ్ సిఫార్సులు సమంజసం కాదు

Trending News