ఏపీలో కాంగ్రెస్ పార్టీ పునరుజ్దీవం సంగతెలా ఉన్నా..కీలక నేతలు ఒక్కొక్కరిగా పార్టీ వీడుతున్నారు. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ తీర్ధం పుచ్చుకోనున్నారని తెలుస్తోంది. అమిత్ షా హైదరాబాద్ పర్యటన ఇందుకు వేదిక కావచ్చని సమాచారం.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా చేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజన సమయంలో జై సమైక్యాంధ్ర పార్టీ పేరుతో కొత్త పార్టీ స్థాపించారు. ఆ ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత చాలాకాలం క్రియాశీలకంగా లేరు. ఇటీవల తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరినా క్రీయాశీలకంగా వ్యవహరించలేదు. గిడుగు రుద్రరాజుకు పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వడమే ఇందుకు కారణమనే వాదన ఉంది. ఇప్పుడు తన రాజకీయ భవిష్యత్ కోసం బీజేపీని ఆశ్రయించేందుకు సిద్ధమౌతున్నారు.
అటు బీజేపీకు కూడా ఏపీలో సీనియర్ నేత అవసరముంది. కన్నా లక్ష్మీ నారాయణ పార్టీ వదిలి వెళ్లిపోవడం, సోము వీర్రాజు ఒక్కడే పార్టీని నడపలేకపోవడం వంటి కారణాలతో కిరణ్ కుమార్ రెడ్డిని చేర్చుకునేందుకు బీజేపీ కొద్దికాలంగా ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డి పార్టీలో చేరితే మంచి పదవి ఇస్తమని హామీ ఇచ్చినట్టు సమాచారం. అందుకే కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్‌లో అమిత్ షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకోవచ్చని తెలుస్తోంది.
Also read: MP Avinash Reddy: వైఎస్ వివేకా హత్య కేసులో సంచలన విషయాలు.. మొత్తం బయటపెట్టిన అవినాష్ రెడ్డి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook