Jr Ntr Meet Amit Shah: జూనియర్ తో టీడీపీ ఖేల్ ఖతం! అమిత్ షా ప్లాన్ చెప్పిన కొడాలి నాని

Jr Ntr Meet Amit Shah: తెలంగాణ పర్యటనలో భాగంగా శంషాబాద్ నోవాటెల్  హోటల్ లో పాన్ ఇండియా హీరో జూనియర్ ఎన్టీఆర్ తో  కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమావేశం కావడం దేశ వ్యాప్తంగా చర్చగా మారింది. అమిత్ షా, జూనియర్ భేటీపై జాతీయ మీడియాలో ప్రత్యేక కథనాలు వచ్చాయి

Written by - Srisailam | Last Updated : Aug 22, 2022, 02:36 PM IST
  • జూనియర్ పై కొడాలి నాని సంచలనం
  • ఎన్టీఆర్ తో బీజేపీ ప్రచారం- నాని
  • ఏపీలో టీడీపీ ఖేల్ ఖతం- నాని
 Jr Ntr Meet Amit Shah: జూనియర్ తో టీడీపీ ఖేల్ ఖతం! అమిత్ షా ప్లాన్ చెప్పిన కొడాలి నాని

Jr Ntr Meet Amit Shah: తెలంగాణ పర్యటనలో భాగంగా శంషాబాద్ నోవాటెల్  హోటల్ లో పాన్ ఇండియా హీరో జూనియర్ ఎన్టీఆర్ తో  కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమావేశం కావడం దేశ వ్యాప్తంగా చర్చగా మారింది. అమిత్ షా, జూనియర్ భేటీపై జాతీయ మీడియాలో ప్రత్యేక కథనాలు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో అయితే అదో సెన్సెషన్ అయింది. జూనియర్ ఎన్టీఆర్ తో అమిత్ షా ఏం మాట్లాడారు..  త్రిపుల్ ఆర్ సినిమా గురించే మాట్లాడుకున్నారా లేక రాజకీయాలపై చర్చ జరిగిందా అన్న చర్చలు జోరుగా సాగుతున్నాయి. గతంలో తెలుగు దేశం పార్టీ కోసం రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేశారు జూనియర్ ఎన్టీఆర్. దీంతో తారక్ తో  రాజకీయాల గురించే అమిత్ షా చర్చించి ఉంటారనే టాక్ తెరపైకి వచ్చింది. ఏపీలో అయితే ఈ భేటీపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా కొత్త కొత్త కోణాలు తెరపైకి వస్తున్నాయి.

జూనియర్ ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా చెప్పుకునే ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని.. అమిత్ షా- జూనియర్ ఎన్టీఆర్ సమావేశంపై స్పందించారు. ఆ ఇద్దరి సమావేశంపై ఆయన సంచలన కామెంట్లు చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్టీఆర్ తో అమిత్ షా మాట్లాడారని చెప్పారు. తమకు ఏమాత్రం ఉపయోగం లేకుంటే ప్రధాని మోడీ అయినా.. అమిత్ షా అయినా ఎవరితోనూ ఒక్క నిమిషం కూడా మాట్లాడరని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీని విస్తరించే వ్యూహాంలో భాగంగానే జూనియర్ తో అమిత్ షా చర్చించారని తెలిపారు. తారక్ సపోర్టుతో ఏపీలో బీజేపీని బలోపేతం చేయాలని అమిత్ షా వ్యూహంగా ఉందని తాను భావిస్తున్నానని కొడాలి నాని తెలిపారు.  జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ కాబట్టి.. అతనితో దేశ వ్యాప్తంగా ప్రచారం చేయించుకునే ప్లాన్ లో బీజేపీ పెద్దలు ఉన్నారని చెప్పారు.జూనియర్ ఎన్టీఆర్ బీజేపీకి మద్దతుగా ఉంటే తెలుగుదేశం పార్టీ కథ ముగిసినట్టేనని కొడాలి నాని స్పష్టం చేశారు. ప్రయోజనం లేదని భావించడం వల్లే చంద్రబాబుకు ప్రధాని మోడీ,. అమిత్ షా అపాయింట్ మెంట్ ఇవ్వలేదన్నారు.

మరోవైపు అమిత్ షా- జూనియర్ ఎన్టీఆర్ భేటీపై ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ను బీజేపీ ఎన్నికల ప్రచారానికి ఆహ్వానిస్తామని చెప్పారు. అమిత్ షా, తారక్ ల కలయిన రాబోయే రోజుల్లో సంచలనంగా మారబోతుందని చెప్పారు. జూనియర్ తో జనసేన-బీజేపీ పొత్తుపై ఎలాంటి ప్రభావం ఉండదని విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు.  పవన్ కల్యాణ్, ఎన్టీఆర్‌ను బీజేపీ సమానంగా చూస్తోందని తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ డైనమిక్ లీడరంటూ ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి కామెంట్ చేశారు.

Read also: Mlc Kavitha: కేసీఆర్ ను బద్నాం చేసేందుకు బీజేపీ కుట్ర.. లిక్కర్ స్కాంతో తనకు సంబంధం లేదన్న కవిత

Read also: Telugu Movie Releases: లైగర్- రిపీట్ సహా ఈ వారం రిలీజవుతున్న సినిమాలివే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News