ఏపీ ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉన్నత విద్య ప్రవేశం కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష తేదీలను ప్రకటించింది.

Last Updated : Jan 8, 2018, 02:41 PM IST
 ఏపీ ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉన్నత విద్య ప్రవేశం కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష తేదీలను ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే.. ఈ ఏడాది పరీక్షలను ముందుగానే నిర్వహిస్తున్నాం. పరిక్షలన్నీ ఆన్లైన్ లోనే జరుగుతాయి అని విద్యాశాఖామంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ప్రవేశ పరీక్షల తేదీల వివరాలు ఇలా ఉన్నాయి.

2016-18 బీఎడ్, డీఎడ్ విద్యార్థులకు శుభవార్త

2016-18 బీఎడ్, డీఎడ్ విద్యార్థులకు టెట్ లో అర్హత కల్పిస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయించిందని గంటా తెలిపారు. వచ్చే ఏడాది ఏ గ్రేడ్ కాలేజీల్లో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం(డిగ్రీతో పాటు బీఎడ్) ఈ ఏడాది నుంచే ప్రారంభిస్తాం అని అన్నారు.

ప్రవేశ పరిక్షలు  తేదీ  సమయం 
ఏపీ-ఎడ్ సెట్ 19-04-2018 11:00am-1:00pm 
ఏపీ-లాసెట్ 19-04-2018 3:00pm-4:30pm
ఏపీ-ఎంసెట్(ఎంపీసీ) 22-04-2018 నుండి 25-04-2018 వరకు 9:00am-12:00pm & 2:30pm-4:00pm
ఏపీ-ఎంసెట్ (బైపీసీ) 26-04-018 9:00am-12:00pm & 2:30pm-4:00pm
ఏపీ-ఐసెట్ 02-05-2018 10:30am-12:30pm & 2:30pm-5:00pm
ఏపీ-ఈసెట్ 03-05-2018 10:00am-1:00pm
ఏపీ-పీజీఈసెట్ 10-05-2018 నుండి 12-05-2018 వరకు  10:00am-12:00pm & 2:00pm-4:00pm
ఏపీ-పీఈసెట్ 04-05-2018 నుండి  9:00am నుండి

 

Trending News