Ap Voters List: ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ఓటరు ముసాయిదా జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య, పురుషులు, మహిళలు ఎంతమందనే వివరాలు వెల్లడయ్యాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల బోగస్ ఓట్ల తొలగింపు జరిగింది. తుది జాబితా 2 నెలల్లో సిద్దం కానుంది.
ఏపీ అసెంబ్లీ ఎన్నికలు 2024లో జరగనున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడుతుందనే అంశంపై ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది. వచ్చే ఏడాది మార్చ్ నెలలో ఏపీ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావచ్చని, ఏప్రిల్ నెలలో ఎన్నికలుండవచ్చని ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనా తెలిపారు. రాష్ట్రంలో ఓటర్ల ముసాయిదా జాబితాను విడుదల చేసిన ఆయన 10 లక్షల బోగస్ ఓట్లు తొలగించామన్నారు. తప్పుడు అభ్యంతరాలు, తప్పుడు దరఖాస్తులు సమర్పిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
ఏపీలో మొత్తం 4 కోట్ల 2 లక్షల 21 వేల 450 మంది ఓటర్లున్నారు. ఇందులో మహిళా ఓటర్లు 2 కోట్ల 3 లక్షల 85 వేల 851 మంది కాగా, పురుషులు 1 కోటి 98 లక్షల 31 వేల 791 మంది ఉన్నారు. ఇతరులు 3 వేల 808 మంది ఉన్నారు. అంటే రాష్ట్రంలో మహిళా ఓటర్లదే ఆధిక్యం కన్పిస్తోంది. ఇప్పటి వరకూ 2 లక్షల 36 వేల ఓటర్లు పెరిగినట్టు ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. అనంతపురం జిల్లాల్లో అత్యధికంగా 19 లక్షల 79 వేల 755 మంది ఓటర్లుండగా, అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 7 లక్షల 40 వేల 857 మంది ఓటర్లున్నారు. 19 లక్షల 72 వేల ఓటర్లతో కర్నూలు జిల్లా మూడవ స్థానంలో ఉంది.
ఓటర్ల జాబితాలో సమగ్ర పరిశీలన అనంతరం మొత్తం 21 లక్షల 18 వేల 940 ఓట్లు తొలగించామని ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా చెప్పారు. ప్రస్తుతం ఈవీఎం మిషన్ల తొలి దశ పరిశీలన జరుగుతోందన్నారు. ఓటు అర్హత ఉన్నవాళ్లు జనవరి 1 వరకూ ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవకాశముందన్నారు. అభ్యంతరాల నమోదుకు డిసెంబర్ 9 చివరి తేదీ అని, జనవరి 5న తుది ఓటర్ల జాబితా వెలువడుతుందని చెప్పారు.
Also read: Chandrababu Security: చంద్రబాబుకు పూర్తి స్తాయిలో భద్రత, అవాస్తవాలు నమ్మవద్దు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook