AP Survey 2024: ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. వైనాట్ 175 లక్ష్యంతో అధికార వైసీపీ దూకుడు ప్రదర్శిస్తుంటే..ఈసారి ఎలాగైనా అధికారం కైవసం చేసుకునేందుకు టీడీపీ-జనసే కూటమి ప్రయత్నిస్తోంది. మరోవైపు ఒక్కొక్కటిగా వెలువడుతున్న సర్వేలు వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి.
ఏపీ ఎన్నికల షెడ్యూల్ ఫిబ్రవరి రెండవ వారంలో వెలువడవచ్చు. ఏప్రిల్ మొదటి లేదా రెండవ వారంలో ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో వివిధ సంస్థలు చేపడుతున్న ప్రీ పోల్ సర్వేలు ఆసక్తి రేపుతున్నాయి. తాజాగా వెలువడిన మరో సర్వే సంచలన ఫలితాలు వెల్లడించిందది. మూడ్ ఆఫ్ ద ఏపీ పేరుతో పాపులర్ ప్రీ పోల్ సర్వే ఇది. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే ఎవరికి ఎన్ని స్థానాలొస్తాయనేది వెల్లడించింది. అయితే ఈ సంస్థ సర్వే కేవలం పార్లమెంట్ స్థానాలకే పరిమితమైంది. అసెంబ్లీ స్థానాల్లో సర్వే చేసిందో లేదో గానీ ఫలితాలు వెల్లడించలేదు.
ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మొత్తం 25 లోక్‌సభ స్థానాల్లో 1 0 స్థానాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెల్చుకోనుంది. ఇక టీడీపీ-జనసేన కూడా పోటా పోటీగా 9 స్థానాలు గెల్చుకోవచ్చు. ఇక మిగిలిన 6 స్థానాల్లో గట్టి పోటీ ఉంటుందని పాపులర్ ఫ్రీ పోల్ సర్వే వెల్లడించింది. విజయనగరం, అరకు, అమలాపురం, ఏలూరు, కడప, రాజంపేట, చిత్తూరు, తిరుపతి, విజయవాడ, నంద్యాల లోక్‌సభ స్థానాల్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెల్చుకుంటుందని, ఇక శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, నరసరావుపేట, బాపట్ల, నరసాపురం, కాకినాడ, కర్నూలు, హిందూపురం పార్లమెంట్ స్థానాల్ని తెలుగుదేశం-జనసేన గెల్చుకోగలవు. ఇక రాజమండ్రి, అనంతపురం, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, మచిలీపట్నం స్థానాల్లో గట్టి పోటీ ఉంటుందని తేలింది.
ఈ లెక్కన పార్లమెంట్ ఫలితాలనే లెక్కలోకి తీసుకుంటే వైసీపీకు 70 అసెంబ్లీ సీట్లు, టీడీపీ-జనసేన కూటమికి 63 స్థానాలు రావచ్చు.గట్టిపోటీ ఉండే 6 స్థానాలకు చెందిన 42 అసెంబ్లీ స్థానాల్లో ఎవరెక్కువ స్థానాలు గెల్చుకుంటే అధికారం వారికే దక్కుతుంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండింటికీ చెమటలు పట్టిస్తున్న సర్వే ఇది. దాంతో అందరిలో టెన్షన్ ప్రారంభమైంది.
Also read: Skin Care Tips: నిత్య యౌవనంగా, అందంగా కన్పించాలంటే ఏం చేయాలి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
AP Survey 2024: ఉత్కంఠ రేపుతున్న తాజా సర్వే, పార్టీలకు చెమట్లు