గుడ్ న్యూస్: రైతు భరోసా సాయాన్ని రూ.13,500లకు పెంచిన సీఎం జగన్

గుడ్ న్యూస్: రైతు భరోసా సాయాన్ని రూ.13,500లకు పెంచిన సీఎం జగన్

Last Updated : Oct 15, 2019, 10:05 AM IST
గుడ్ న్యూస్: రైతు భరోసా సాయాన్ని రూ.13,500లకు పెంచిన సీఎం జగన్

అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులకు శుభవార్త వెల్లడించారు. రైతు భరోసా పథకం కింద ప్రభుత్వం అందిస్తున్న పెట్టుబడి సాయాన్ని మరో రూ.1000 పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. దీంతో ఇప్పటివరకు రైతు భరోసా పథకం కింద రైతులకు ఏడాదికి అందుతున్న రూ.12,500ల స్థానంలో ఇప్పటి నుంచి రూ.13,500 అందనున్నాయి. నాలుగేళ్లపాటు రూ.12,500 ఇస్తామని ఎన్నికల ప్రణాళికలో జగన్ హామీ ఇవ్వగా.. ఇప్పుడు ఐదేళ్ల పాటు రూ.13,500లు ఇవ్వనున్నట్టు స్పష్టంచేశారు. ఈ ఐదేళ్లలో రూ.67,500 రైతులకు లబ్ధి చేకూరనుంది. నెల్లూరు జిల్లాలో నేడు ముఖ్యమంత్రి రైతు భరోసా పథకాన్ని ప్రారంభించనుండగా అంతకన్నా ఒకరోజు ముందే దీనిపై ప్రకటన విడుదల చేశారు. కౌలు రైతులకు కార్డులు ఇవ్వడంతోపాటు రైతులకు రైతు భరోసా పథకం కింద వ్యవసాయం పెట్టుబడి సాయంగా చెక్కులు ఇవ్వనున్నారు. 

రైతులకు అవసరాలను దృష్టిలో ఉంచుకుని మూడు విడతల్లో పెట్టుబడి సాయం అందించాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఏపీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని రైతులకు మే నెలలో రూ.7,500, ఖరీఫ్‌ పంట కోసే సమయంలో, రబీ అవసరాలకోసం రూ.4000, సంక్రాంతి పండుగ సమయంలో రూ.2వేలు చొప్పున పెట్టుబడి సహాయం లభించనుంది.

Trending News