Ys jagan Vizag Tour: ప్రతిష్ఠాత్మక ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ తన తొలి కార్యాలయాన్ని ఏపీలో ప్రారంభించనుంది. రేపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా ఇన్ఫోసిస్ కార్యాలయం ప్రారంభమౌతుంది. అటు మరో రెండు కంపెనీలను ప్రారంభించనున్నారు జగన్.
దసరా నాటికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖపట్నంకు మకాం మార్చనున్నారు. ఇక దసరా నుంచి అక్కడి నుంచే పరిపాలన సాగిస్తారు. ఇందులో భాగంగా సీఎంవోను సైతం తరలిస్తున్నారు. విశాఖపట్నం నుంచి త్వరలో పాలన ప్రారంభం కానున్న నేపధ్యంలో అంతకంటే ముందే రేపు విశాఖలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. రేపు ఉదయం1 10 గంటలకు విజయవాడ విమానాశ్రయం నుంచి బయలుదేరి 10.20 గంటలకు విశాఖ చేరుకుంటారు. అక్కడి నుంచి హెలీకాప్టర్ ద్వారా మధురవాడ ఐటీ హిల్స్‌కు చేరుకుంటారు. రోడ్డు మార్గంలో ఇన్ఫోసిస్ డెవలప్‌మెంట్ సెంటర్‌కు చేరుకుని ఆ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. దాదాపు ఓ గంటసేపు అదే ప్రాంగణంలో గడుపుతారు. ఆ తరువాత జీవీఎంసీ ఏర్పాటు చేసిన బీచ్ క్లీనింగ్ యంత్రాలను ప్రారంభిస్తారు.
మద్యాహ్నం 12.05 గంటలకు అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో యూగియా స్టెరైల్ ఫార్మా కంపెనీని ప్రారంభిస్తారు. ఆ తరువాత అచ్యుతాపురం ఎస్ఈజెడ్‌లో లారస్ ల్యాబ్స్ యూనిట్ 2 ప్రారంభిస్తారు. ఆ తరువాత విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరుతారు.
అక్టోబర్ 16 సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటనలో ఇన్ఫోసిస్ కార్యాలయంతో పాటు ఫార్మాసిటీలో నిర్మించిన యూగియా స్టెరైల్ ఫార్మా కంపెనీ, అచ్యుతాపురం ఎస్ఈజెజడ్‌లో లారస్ ల్యాబ్స్ యూనిట్ 2లను ప్రారంభిస్తారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా విశాఖపట్నంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
Also read: Undavalli Key Comments: సెక్షన్ 17ఏ చంద్రబాబుకు వర్తిస్తే, జగన్‌కూ వర్తించాలి కదా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook