Ys jagan: ఏప్రిల్ నుంచి జనంలోనే వైఎస్ జగన్, కొత్త కార్యక్రమం ప్రారంభం

Ys jagan: 2024 ఎన్నికలు సమీపిస్తుండటంతో వైనాట్ 175 అంటున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందుకు సిద్ధమౌతున్నారు. రాష్ట్రంలోని పల్లెల్ని దృష్టిలో ఉంచుకుని వైఎస్ జగన్ బస్సు యాత్ర చేపట్టనున్నారు. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 7, 2023, 03:41 PM IST
Ys jagan: ఏప్రిల్ నుంచి జనంలోనే వైఎస్ జగన్, కొత్త కార్యక్రమం ప్రారంభం

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏప్రిల్ నెల నుంచి సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఆన్‌స్పాట్ ప్రజా సమస్యల పరిష్కారం కార్యక్రమాన్ని స్వయంగా నిర్వహించనున్నారు. ఏప్రిల్ నుంచి బస్సు యాత్ర ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇకపై పూర్తి స్థాయిలో జనంలో గడపనున్నారు. ఆన్‌స్పాట్ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నేరుగా ప్రజల్ని కలవనున్నారు. పల్లె ప్రజల్ని దృష్టిలో ఉంచుకుని పల్లెయాత్ర చేపట్టనున్నారు. ఏప్రిల్ నుంచి వైఎస్ జగన్ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

2024లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలున్నాయి. ఓ వైపు ప్రధాన ప్రతిపక్షం తరపున నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర ప్రారంభించారు. మరోవైపు జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ప్రారంభం కానుంది. ఎన్నికలకు ఇంకా కేవలం ఏడాది సమయమే ఉండటంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొత్త యాత్ర ప్రారంభిస్తున్నారు. ఇది బస్సు ద్వారా సాగే పల్లెయాత్ర. ఇందులో భాగంగా మండలంలో 2-3 పల్లెల్ని ఎంచుకుని..అక్కడే ప్రజలతో ముఖాముఖి అవుతారు. ప్రజా సమస్యల్ని తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరిస్తారు. మరోవైపు అక్కడే ప్రజలతోనే పల్లె నిద్ర చేయనున్నారు. 

ఎన్నికలకు దాదాపు ఏడాది సమయమే ఉండటంతో అన్ని పార్టీలు సిద్ధమౌతున్నాయి. గెలుపు కోసం వ్యూహం సిద్ధం చేసుకుంటున్నాయి. తగిన సమయంలో చంద్రబాబు కూడా బస్సు యాత్ర చేపట్టాలని ఆలోచిస్తున్నారు. ప్రతి మండలంలో 2-3 పల్లెల్లో పల్లె నిద్ర చేసేవిధంగా  వైసీపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకానికి విస్తృతమైన ప్రచారం కల్పించాలనేది వైసీపీ ఆలోచనగా ఉంది. 

నిజానికి గత ఏడాదే వైఎస్ జగన్ ఈ యాత్ర చేపట్టాల్సి ఉంది. అయితే ఎన్నికల ముందు నిర్వహించడం ద్వారా ప్రచారం ముమ్మరం చేయాలనేది ప్రధాన ఆలోచనగా ఉంది.

Also read: Kapu Reservation: కాపులకు 5 శాతం రిజర్వేషన్, కౌంటర్ కోసం ఏపీ ప్రభుత్వానికి ఆదేశం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News