Ys Jagan: దసరాకే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్..విశాఖ షిఫ్టింగ్, పూర్తవుతున్న ఏర్పాట్లు

Ys Jagan: ఏపీ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ విశాఖపట్నం కేంద్రంగా పాలన త్వరలో ప్రారంభం కానుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖ బదిలీకి సన్నాహాలు పూర్తవుతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 18, 2023, 08:18 AM IST
Ys Jagan: దసరాకే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్..విశాఖ షిఫ్టింగ్, పూర్తవుతున్న ఏర్పాట్లు

Ys Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ త్వరలోనే విశాఖపట్నంకు మకాం మార్చనున్నారు. రాజధానుల విషయంలో కోర్టు తీర్పుతో సంబంధం లేకుండా ముఖ్యమంత్రి పాలన మాత్రం విశాఖ నుంచి ప్రారంభం కావచ్చు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు దాదాపు పూర్తవుతున్నాయి.

ఏపీ మూడు రాజధానులు, పరిపాలన వికేంద్రీకరణ అంశాల్లో కోర్టు తీర్పు పెండింగులో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రికి ఎక్కడ్నించైనా పాలన సాగించే హక్కున్న నేపధ్యంలో త్వరలో విశాఖకు మకాం మార్చనున్నారు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వయంగా వెల్లడించారు. విశాఖలో జరిగిన ఇన్వెస్టర్ల సదస్సులో అందరు పారిశ్రామికవేత్తల ముందు ఈ విషయాన్ని వెల్లడించారు. ఇక అప్పట్నించి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే ఈ దసరా నాటికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలన విశాఖకు మార్చవచ్చని సమాచారం. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు దాదాపుగా పూర్తికావస్తున్నాయి. 

రుషికొండలో జరుగుతున్న ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ నిర్మాణ పనుల్ని వేగవంతం చేశారు. ప్రస్తుతం ఇంటీరియర్ పనులు జరుగుతున్నాయి. మరో 15 రోజుల్లో ఈ పనులు పూర్తి కావచ్చు. నిర్మాణాలు పూర్తవడమే ఆలస్యం..ముఖ్యమంత్రి జగన్ విశాఖకు మకాం మార్చేందుకు సిద్ఘంగా ఉన్నారని తెలుస్తోంది. 

ఇప్పటికే విశాఖలోని రుషికొండ చుట్టూ భద్రతా వలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. టూరిజం ప్రాజెక్టు చుట్టూ భారీ రక్షణ గోడను 10 అడుగుల ఎత్తులో దాదాపు 8.58 కోట్ల ఖర్చుతో నిర్మించనున్నారు. మరో 4.20 కోట్ల ఖర్చుతో గార్డెనింగ్ టెండర్లు పిలిచారు. ముఖ్యమంత్రి విశాఖ బదిలీ కార్యక్రమంలో భాగంగానే ఇటీవల విశాఖపట్నం పోలీస్ కమీషనరేట్‌ను అడిషనల్ డీజీ కేడర్‌కు అప్‌గ్రేడ్ చేసి రవిశంకర్ అయ్యన్నార్‌ను సీపీగా నియమించారు. శాంతి భద్రతల సమస్య రాకుండా ఈ ఏర్పాట్లు చేశారు. అంటే ముఖ్యమంత్రి జగన్ బదిలీ అయ్యేనాటికి లా అండ్ ఆర్డర్ ఏర్పాట్లు పూర్తి కానున్నాయి.

Also read: Parliament Special Session: ఇవాళ్టి నుంచే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు, ఇవే కీలకాంశాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News