ఏపీ అసెంబ్లీ సమావేశాల ప్రారంభంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అచ్చెన్నాయుడిపై ఏపీ ముఖ్యమంత్రి వైెఎస్ జగన్ ఓ రేంజ్ లో సెటైర్లు విసిరారు. ఇవే ఇప్పుడు ఆసక్తి కల్గిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ( Ap Assembly winter session ) ప్రారంభమయ్యాయి. సమావేశం ప్రారంభమవుతూనే..టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) తనదైన శైలిలో చురకలు వేశారు. బీఏసీ సమావేశానికి హాజరైన అచ్చెన్నాయుడు ( Tdp mla Atchannaidu ) సభ ఆలస్యంపై ప్రశ్నించగా..తనదైన శైలిలో సమాధానమిచ్చారు జగన్. గౌరవ సభ్యుడు అచ్చెన్నాయుడు ధర్నా చేస్తున్నందున సమావేశాన్ని ఆలస్యంగా ప్రారంభించామంటూ ఎద్దేవా చేశారు. అంతేకాకుండా అచ్చెన్నాయుడు ది గ్రేట్ అంటూ కామెంట్ చేశారు.
ఎస్సీ, ఎస్టీ దాడులపై చర్చ జరగాలని అచ్చెన్నాయుడు ప్రస్తావించగా..వైసీపీ పార్టీ ( ysrcp ) ఎంపీ సురేష్ పై టీడీపీ చేసిన దాడినేనా అంటూ వైఎస్ జగన్ సెటైర్ విసిరారు. తమను టీవీలో చూపించడం లేదంటూ అచ్చెన్నాయుడు అడిగినప్పుడు కూడా అదే విధంగా విమర్శలు ఎక్కుపెట్టారు. ఆరడుగుల అజానుబాహుడివి..నువ్వు కన్పించకపోవడమేంటన్నాా అంటూ సెటైర్ విసిరారు.
అనంతరం శాసనసభ సమావేశాల్నించి టీడీపీ సభ్యులు వాకౌట్ ( Tdp walkout ) చేశారు. పంచాయితీ రాజ్ చట్ట సవరణ బిల్లుపై చర్చించకుండానే ఆమోదించినందుకు నిరసనగా సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. తెలుగుదేశం పార్టీకు అమరావతి రైతులు తప్ప..మిగిలిన రైతులు కన్పించడం లేదని మంత్రి కన్నబాబు ( Minister kannababu ) వ్యాఖ్యానించారు. చంద్రబాబు నటించడం తమ ముఖ్యమంత్రికి రాదన్నారు.
ఐదు రోజుల అసెంబ్లీ సమావేశాలు సరిపోకపోతే..చంద్రబాబు, లోకేష్ లు కలిసి జూమ్ మీటింగ్ పెట్టుకోవాలని మరో మంత్రి కొడాలి నాని విమర్శలు చేశారు. Also read: Ap Assembly live updates: ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు