Ys Jagan Review: రాష్ట్రంలో తగ్గిన మద్యం అమ్మకాలు, అక్రమ రవాణాపై ఉక్కుపాదం

Ys Jagan Review: ఏపీలో మద్యపానాన్ని నియంత్రించే దిశగా చర్యలు చేపడుతోంది ప్రభుత్వం. ఓ వైపు మద్యపానాన్ని నియంత్రిస్తూనే మరోవైపు అక్రమ మద్యం తయారీ, రవాణాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 23, 2021, 04:39 PM IST
Ys Jagan Review: రాష్ట్రంలో తగ్గిన మద్యం అమ్మకాలు, అక్రమ రవాణాపై ఉక్కుపాదం

Ys Jagan Review: ఏపీలో మద్యపానాన్ని నియంత్రించే దిశగా చర్యలు చేపడుతోంది ప్రభుత్వం. ఓ వైపు మద్యపానాన్ని నియంత్రిస్తూనే మరోవైపు అక్రమ మద్యం తయారీ, రవాణాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. 

ఏపీలో మద్యం నియంత్రణ, అక్రమ తయారీ, రవాణాను అరికట్టేందుకు ఏర్పడిన స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరోపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్(Ap cm ys jagan)కీలకమైన సమీక్ష నిర్వహించారు. అక్రమంగా మద్యం తయరీ, రవాణాపై ఉక్కుపాదం మోపాలని జగన్ ఆదేశించారు. మద్యం అక్రమ రవాణా, తయారీకు పాల్పడుతున్నవారిపై కఠిన చర్యల కోసం ఇప్పటికే చట్టాన్ని తీసుకొచ్చామన్నారు. 

మద్యం నియంత్రణలో భాగంగానే రాష్ట్రంలో మద్యం రేట్లను భారీగా పెంచామని చెప్పారు వైఎస్ జగన్. మూడింట ఒక వంతు దుకాణాల్ని మూసివేశామని, బెల్టు షాపులు, పర్మిట్ రూమ్‌లను తీసేశామన్నారు. రాష్ట్రంలో లిక్కర్ అమ్మకాలు నెలకు 34 లక్షల కేసుల నుంచి 21 లక్షల కేసులకు తగ్గిందని వైఎస్ జగన్ పేర్కొన్నారు. బీరు అమ్మకాలు నెలకు 17 లక్షల్నించి 7 లక్షలకు తగ్గిందన్నారు. మద్యం అమ్మకాలు తగ్గుముఖం పడుతున్న సమయంలో అక్రమ మద్యం రవాణాను(Illegal liquor Transport)పూర్తి స్థాయిలో అడ్డుకోవాలని సూచించారు. మరోవైపు ఇసుక సరఫరాపై దృష్టి సారించారు. ఇసుకను నిర్దేశించిన రేట్ల కంటే ఎక్కువ ధరకు అమ్మితే చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టగానే ఎక్కువ సంఖ్యలో రీచ్‌లు, డిపోల సంఖ్య పెరిగేలా చూడాలన్నారు. వినియోగదారుల నుంచి కాల్ సెంటర్‌కు వచ్చే ఫోన్లపై వెంటనే స్పందించాలని సూచించారు. 

Also read: Krithi Shetty: ఉప్పెన కృతిశెట్టి పారితోషికం ఇప్పుడెంతో తెలుసా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News